యేడాదిలోగా ఎర్రవల్లికి కొత్తరూపు: కేసీఆర్‌

వచ్చే దసరా నాటికి ఎర్రవెల్లి రూపురేఖలను పూర్తిగా మార్చి వేస్తామని, ఈ ప్రాంతాన్ని చూడటానికి దేశదేశాల నుంచి ప్రముఖులు తరలి వచ్చేలా చేస్తానని ఆ గ్రామ ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎర్రవల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రముఖపాత్ర పోషించి ముందుండాలని సూచించారు. విజయదశమి రోజున ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన అన్నారు. చెత్త, మురుగునీటి వ్యవస్తను మెరుగు పరుచుకోవాలని ప్రజలకు […]

Advertisement
Update: 2015-10-21 13:03 GMT

వచ్చే దసరా నాటికి ఎర్రవెల్లి రూపురేఖలను పూర్తిగా మార్చి వేస్తామని, ఈ ప్రాంతాన్ని చూడటానికి దేశదేశాల నుంచి ప్రముఖులు తరలి వచ్చేలా చేస్తానని ఆ గ్రామ ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎర్రవల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రముఖపాత్ర పోషించి ముందుండాలని సూచించారు. విజయదశమి రోజున ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన అన్నారు. చెత్త, మురుగునీటి వ్యవస్తను మెరుగు పరుచుకోవాలని ప్రజలకు సూచించారు. చెరువుల్లో నీరు నింపుకోవడం ద్వారా తాగు, సాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్, ఎస్పీ సహకారం తీసుకుని చెరువులను బాగు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. నేటి నుంచి పేదల బతుకుల్లో కొత్త మలుపు రానుందని, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు 60 వేల ఇళ్ళకు శంకుస్థాపనలు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ ఇళ్ళ నిర్మాణం ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఏడాది లోపే సుర్యాపేట నియోజకవర్గంలోని ప్రజలకు పాలేరు రిజర్వయర్ నుంచి మంచినీరు అందిస్తామని, సూర్యాపేట రాబోయే మార్చి లోపు జిల్లా కేంద్రంగా మారుతుందని ఆయన తెలిపారు. కాగా విజయదశమి రోజు కావడంతో ఖమ్మం జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే కేసీఆర్‌ సంకల్పమని, ఈ లక్ష్యంతోనే తామంతా పని చేస్తున్నామని తుమ్మల అన్నారు.

Tags:    
Advertisement

Similar News