బురఖాలకు పాకిస్థాన్‌ సడలింపు?

ఇస్లాం మతంలోని మహిళలు మొత్తం శరీరం కప్పి ఉంచేలా… ముసుగులు ధరించడం తప్పనిసరి కాదని పాకిస్థాన్‌ రాజ్యాంగ సంస్థ స్పష్టం చేసింది. బురఖా అనేది అల్లర్ల నుంచి తప్పించుకునేందుకే కాని అది నిర్బంధం కాదని తెలిపింది. మౌలానా మహ్మద్‌ ఖాన్‌ షెరానీ అధ్యక్షతన ఇస్లామిక్‌ ఐడియాలజీ కౌన్సిల్‌ సమావేశమైంది. ముఖం, చేతులు, పాదాలు కనిపించకుండా ఉండే విధంగా మహిళలు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదని ఈ సమావేశం అభిప్రాయ పడింది. బురఖాలు ధరించాలన్న నిబంధనను సడలిస్తూ తీసుకున్న […]

Advertisement
Update: 2015-10-20 08:58 GMT

ఇస్లాం మతంలోని మహిళలు మొత్తం శరీరం కప్పి ఉంచేలా… ముసుగులు ధరించడం తప్పనిసరి కాదని పాకిస్థాన్‌ రాజ్యాంగ సంస్థ స్పష్టం చేసింది. బురఖా అనేది అల్లర్ల నుంచి తప్పించుకునేందుకే కాని అది నిర్బంధం కాదని తెలిపింది. మౌలానా మహ్మద్‌ ఖాన్‌ షెరానీ అధ్యక్షతన ఇస్లామిక్‌ ఐడియాలజీ కౌన్సిల్‌ సమావేశమైంది. ముఖం, చేతులు, పాదాలు కనిపించకుండా ఉండే విధంగా మహిళలు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదని ఈ సమావేశం అభిప్రాయ పడింది. బురఖాలు ధరించాలన్న నిబంధనను సడలిస్తూ తీసుకున్న నిర్ణయానికి పాకిస్థాన్‌ రాజ్యాంగ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మౌలానా ప్రకటించారు. ‘మహిళలు మణికట్టు వరకు దుస్తులు ధరించాల్సిన నిర్బంధం ఏమీ లేదు. విలువలు పాటించేలా వస్త్రధారణ ఉంటే బాగుంటుంది. అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు ముఖంతోపాటు శరీరాన్ని కప్పి ఉంచేలా ఉంటే మంచింది. అంతేకాని అది నిర్బంధం కాదు’ అని మౌలానా స్పష్టం చేశారు. అయితే అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు అన్న పదాలకు ఆయన వివరణ ఇవ్వలేక పోయారు.

Tags:    
Advertisement

Similar News