ఇకపై ఫేస్‌బుక్‌లోనూ ఎమోషన్స్ 

నెటిజన్లకు చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. బాధాకరమైన అంశాలకు కూడా లైక్‌ బటన్ నొక్కడం ఇబ్బందిగా ఉందంటూ చాలా కాలంగా నెటిజన్లు అభిప్రాయపడుతుండడంతో డిస్‌లైక్ బటన్‌ కూడా తెస్తామని ఇటీవల ఫేస్ బుక్ ప్రకటించింది.  అయితే ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. ప్రేమ, కోపం, బాధ, సంతోషం , ఆశ్చర్యం వంటి భావోద్వేగాలను వ్యక్తీకరించేందుకు ఆరు కొత్త బటన్స్‌ను తెస్తోంది. లైక్ ఐకాన్‌పై ప్రెస్ చేయడంతో ఈ బటన్స్ కనిపిస్తాయి. ఈ […]

Advertisement
Update: 2015-10-09 23:39 GMT

నెటిజన్లకు చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. బాధాకరమైన అంశాలకు కూడా లైక్‌ బటన్ నొక్కడం ఇబ్బందిగా ఉందంటూ చాలా కాలంగా నెటిజన్లు అభిప్రాయపడుతుండడంతో డిస్‌లైక్ బటన్‌ కూడా తెస్తామని ఇటీవల ఫేస్ బుక్ ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. ప్రేమ, కోపం, బాధ, సంతోషం , ఆశ్చర్యం వంటి భావోద్వేగాలను వ్యక్తీకరించేందుకు ఆరు కొత్త బటన్స్‌ను తెస్తోంది.
లైక్ ఐకాన్‌పై ప్రెస్ చేయడంతో ఈ బటన్స్ కనిపిస్తాయి. ఈ కొత్త పీచర్స్ ప్రస్తుతానికి ఐర్లాండ్, స్పెయిన్‌లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా కొత్త బటన్స్ అందుబాటులోకి వస్తాయని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ చెప్పారు. డిస్‌ లైక్ బటన్ ఇంకా సిద్ధం కాలేదని వెల్లడించారు. హహా.. యాయ్.. వావ్.. శాడ్.. యాంగ్రీ.. అలాగే లైక్.. లవ్ బటన్‌లకు సంబంధించిన ఒక వీడియోను కూడా జుకర్ బెర్గ్ తన ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News