ఏపీలో 770 కి.మీ హైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో 770 కి.మీ హైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులకు వెయ్యి కోట్ల నిధుల విడుదలకు సుముఖత చూపింది. ఏపీ రాజధానిలో 186 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు వరకు 452 కి.మీ హైవే, అమరావతి నుంచి కడప, కర్నూలు, అనంతపురం వరకు 132 కి.మీ రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు రహదారులు రాష్ట్ర రోడ్లు భవనాల […]

Advertisement
Update: 2015-09-28 05:28 GMT
ఆంధ్రప్రదేశ్‌లో 770 కి.మీ హైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులకు వెయ్యి కోట్ల నిధుల విడుదలకు సుముఖత చూపింది. ఏపీ రాజధానిలో 186 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు వరకు 452 కి.మీ హైవే, అమరావతి నుంచి కడప, కర్నూలు, అనంతపురం వరకు 132 కి.మీ రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు రహదారులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిని జాతీయ రహదారులుగా మారుస్తున్నారు. ఈ నేషనల్ హైవే 65కు అనుసంధానం చేస్తారు. ఇందులో ఘాట్‌ రోడ్డు కూడా కొంత భాగం ఉంటుంది. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లాను కలిపే జాతీయ రహదారిలో కొంత భాగం ఘాట్‌ రోడ్డు కూడా ఉంటుంది. ఈ రహదారులను 6 నుంచి 8 లైన్లకు విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన వెంటనే ఈ రహదారుల పనులు ప్రారంభిస్తారు. వీటితోపాటు రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్‌ను వేసేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. విజయవాడ, గుంటూరును కలిపేలా అమరావతి చుట్టూ రింగ్‌రోడ్డును నిర్మిస్తారు. 4 వేల ఎకరాల భూసేకరణ చేస్తారు. ఎనిమిది క్లస్టర్లుగా అనుసంధానం చేస్తారు. 8 లైన్లుగా దీన్ని విస్తరించడానికి రూ. 1000 కోట్లను ఖర్చు చేస్తారు. ఇందుకు కేంద్రం అనుమతించింది.
Tags:    
Advertisement

Similar News