చర్చలతోనే సమస్యలు పరిష్కారం: రాజ్‌నాథ్ సింగ్

పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. మూడు రోజుల పర్యటనలో భాగంగా… జమ్మూకాశ్మీర్‌లోని పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఆయన పర్యటిస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సమయంలో… అక్కడ రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. జమ్మూ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజ్‌నాథ్… సాంబలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ బెటాలియన్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. సరిహద్దు భద్రతపై అక్కడి జవాన్లతో మాట్లాడారు. చర్చలతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని […]

Advertisement
Update: 2015-09-22 00:23 GMT
పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. మూడు రోజుల పర్యటనలో భాగంగా… జమ్మూకాశ్మీర్‌లోని పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఆయన పర్యటిస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సమయంలో… అక్కడ రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. జమ్మూ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజ్‌నాథ్… సాంబలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ బెటాలియన్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. సరిహద్దు భద్రతపై అక్కడి జవాన్లతో మాట్లాడారు. చర్చలతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. చైనా, పాకిస్తాన్ సత్సంబంధాలు కొనసాగించకపోతే… సరిహద్దుల్లో శాంతి అసాధ్యమన్నారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. 812 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తామని, 35 మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని హోం మంత్రి తెలిపారు. మరోవైపు రాజ్‌నాథ్ పర్యటన నేపథ్యంలో… సరిహద్దులో సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు.
Tags:    
Advertisement

Similar News