సిరియా శరణార్థులతో అమెరికాకు ఉగ్ర ముప్పు!

సిరియా శరణార్థులకు ఆశ్రయమిస్తే దీన్ని అవకాశంగా తీసుకుని తీవ్రవాదులు దేశంలో ప్రవేశించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వాన్ని ప్రతిపక్షపార్టీలు హెచ్చరిస్తున్నాయి. అసలే దాడులకు తెగబడతామని, 100 మంది అమెరికా సైన్యాధికారులను మట్టుపెడతామని ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇచ్చిన సలహా అమెరికా ప్రభుత్వం ఆలోచనలో పడింది. శరణార్థులతో పాటే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన జిహాదీలు కూడా చొరబాటుకు ప్రయత్నించవచ్చని హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ మైక్ మెక్‌కాల్ అన్నారు. శరణార్థుల సంక్షోభాన్ని […]

Advertisement
Update: 2015-09-15 00:23 GMT
సిరియా శరణార్థులకు ఆశ్రయమిస్తే దీన్ని అవకాశంగా తీసుకుని తీవ్రవాదులు దేశంలో ప్రవేశించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వాన్ని ప్రతిపక్షపార్టీలు హెచ్చరిస్తున్నాయి. అసలే దాడులకు తెగబడతామని, 100 మంది అమెరికా సైన్యాధికారులను మట్టుపెడతామని ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇచ్చిన సలహా అమెరికా ప్రభుత్వం ఆలోచనలో పడింది. శరణార్థులతో పాటే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన జిహాదీలు కూడా చొరబాటుకు ప్రయత్నించవచ్చని హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ మైక్ మెక్‌కాల్ అన్నారు. శరణార్థుల సంక్షోభాన్ని ఉపయోగించుకొని తాము పశ్చిమదేశాల్లో చొరబడతామని ఐఎస్‌ఐఎస్ స్వయంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.
Tags:    
Advertisement

Similar News