మూడేళ్లకే మేయర్!
మూడేళ్ల పిల్లాడు ఏం చేస్తాడు? అల్లరి తప్ప ఇంకేం చేస్తాడనుకుంటున్నారా? అమెరికాలో మూడేళ్ల కుర్రాడు ఏకంగా మేయర్ అయ్యాడు తెలుసా? ఆ చిన్నారి పేరు జేమ్స్ టఫ్ట్స్ వయసు 3 ఏళ్లు. అమెరికాలోని మిన్నెసొటాలోని డోసెరా అనే చిన్న నగరానికి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం కూడా చేసేశాడు. దీంతో ఈ బుల్లి మేయర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. డోసెరా పర్యాటకమే ప్రధాన ఆదాయంగా ఉన్న నగరం. అందుకే తమ నగరానికి […]
Advertisement
మూడేళ్ల పిల్లాడు ఏం చేస్తాడు? అల్లరి తప్ప ఇంకేం చేస్తాడనుకుంటున్నారా? అమెరికాలో మూడేళ్ల కుర్రాడు ఏకంగా మేయర్ అయ్యాడు తెలుసా? ఆ చిన్నారి పేరు జేమ్స్ టఫ్ట్స్ వయసు 3 ఏళ్లు. అమెరికాలోని మిన్నెసొటాలోని డోసెరా అనే చిన్న నగరానికి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం కూడా చేసేశాడు. దీంతో ఈ బుల్లి మేయర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. డోసెరా పర్యాటకమే ప్రధాన ఆదాయంగా ఉన్న నగరం. అందుకే తమ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండాలన్న ఉద్దేశంతో మేయర్‌గా జేమ్స్‌ను ఎన్నుకున్నారు అక్కడి ప్రజలు. అంతేనా జేమ్స్ అన్న రాబర్ట్స్ ఇదే నగరానికి 3 ఏళ్ల వయసులో ఒకసారి, 4 ఏళ్ల వయసులో మరోసారి రెండుసార్లు మేయర్ అయ్యాడు. వీరిని చూసి వారి తల్లి ఎమ్మా టఫ్ట్స్ పుత్రోత్సాహంతో పొంగిపోతోంది.
Advertisement