మూడంతస్తుల భవనం కూలి 11 మంది దుర్మరణం

మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే జిల్లాలోని థ‌క్రులీలో నాలుగంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలి 9 మంది మ‌ర‌ణించ‌గా, ప‌దిమంది […]

Advertisement
Update: 2015-08-03 23:50 GMT
మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే జిల్లాలోని థ‌క్రులీలో నాలుగంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలి 9 మంది మ‌ర‌ణించ‌గా, ప‌దిమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంఘటన మరిచిపోక ముందు మరో దుర్ఘటన జరగడంతో పాత భవనాల్లో ఉన్న వారు భయానికి గురవుతున్నారు. అసలే వర్షాలతో సతమతమవుతున్న జనం వీటి కారణంగా భవనాలు నానిపోయి ఎక్కడ కూలిపోతాయోనన్న ఆందోళన జనంలో చోటు చేసుకుంది.
Tags:    
Advertisement

Similar News