మ‌సీదులో బాంబు దాడి...9 మంది దుర్మ‌ర‌ణం

ప్రశాంతంగా ఉండే కువైట్ నెత్తురోడింది. రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని షియా వర్గానికి చెందిన అల్ సాదిఖ్ మసీదులో ప్రార్ధనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ ఘటనలో 8 మంది చనిపోగా, 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో  కొందరు పరిస్థితి విషమంగా వుంది. పేలుడు తీవ్రతకు మసీదు గోడలు కూలిపోయాయి. నిత్యం ప్రశాంతంగా ఉండే కువైట్ ఆత్మాహుతి […]

Advertisement
Update: 2015-06-26 13:08 GMT
ప్రశాంతంగా ఉండే కువైట్ నెత్తురోడింది. రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని షియా వర్గానికి చెందిన అల్ సాదిఖ్ మసీదులో ప్రార్ధనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ ఘటనలో 8 మంది చనిపోగా, 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరు పరిస్థితి విషమంగా వుంది. పేలుడు తీవ్రతకు మసీదు గోడలు కూలిపోయాయి. నిత్యం ప్రశాంతంగా ఉండే కువైట్ ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించేపనిలో పడ్డారు. మరోవైపు మసీదు వద్ద బాంబు దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది.
Tags:    
Advertisement

Similar News