అనసూయ (For Children)

మహా మహిళగా, మహా పతివ్రతగా, మహాముని ధర్మపత్నిగా త్రిమూర్తుల మర్మమేరిగిన మహా తల్లిగా లోకానికి చీకట్లు తొలగించిన మహాసాధ్విగా సీతమ్మ తల్లికే సిరులు అలంకరించిన అమ్మగా అనసూయ కథ ఆచంద్ర తారార్కం!                 భాగవతంలో అనసూయను గురించి ఉంది. రామాయణంలోనూ ప్రస్థావన ఉంది. పవిత్రతల్లో మేటి అయిన అనసూయ దేవపరాతి కర్ధముల కూతురు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహాముని భార్య. సప్త ఋషి మండలం ఆకాశంలో ఉత్తరం పక్క ఉంటుంది. నక్షత్ర మండలంలోనే ఉచ్ఛస్థానంలో ఉంటుంది. […]

Advertisement
Update: 2015-06-11 13:02 GMT

మహా మహిళగా, మహా పతివ్రతగా, మహాముని ధర్మపత్నిగా త్రిమూర్తుల మర్మమేరిగిన మహా తల్లిగా లోకానికి చీకట్లు తొలగించిన మహాసాధ్విగా సీతమ్మ తల్లికే సిరులు అలంకరించిన అమ్మగా అనసూయ కథ ఆచంద్ర తారార్కం!

భాగవతంలో అనసూయను గురించి ఉంది. రామాయణంలోనూ ప్రస్థావన ఉంది. పవిత్రతల్లో మేటి అయిన అనసూయ దేవపరాతి కర్ధముల కూతురు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహాముని భార్య. సప్త ఋషి మండలం ఆకాశంలో ఉత్తరం పక్క ఉంటుంది. నక్షత్ర మండలంలోనే ఉచ్ఛస్థానంలో ఉంటుంది. అలా అనసూయ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కథలోకి వస్తే –

ఒకరోజు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు తమ తమ వాహనాలను ఎక్కి మేరు పర్వతం దిశగా వెళుతున్నారు. ఒక ప్రాంతానికి వచ్చేసరికి వాహనాలు కదల్లేదు. అది అత్రి మహాముని భార్య మహా పతివ్రత అయిన అనసూయ ఉండే ఆశ్రమ ప్రాంతమని అటుగా వెళ్ళే దారి లేదని మరో దారిన పోయాడు గరుడుడు. మరోవేపు సరస్వతీ లక్ష్మీ పార్వతుల దగ్గర మహాపతివ్రత ఎవరు అని ముసలం పుట్టించేసాడు నారదుడు. అతడు చెంగున రాళ్ళు కట్టుకువచ్చి, ఆకలిగా ఉంది శనగలు వండి ఇవ్వమన్నాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు విడివిడిగా వెళ్ళాడు. వెళ్ళిన పని కాక తిరిగొచ్చాడు. అనసూయ దగ్గరకు వెళ్ళాడు. రాళ్ళిచ్చి శనగలు వండి ఇవ్వమన్నాడు. అనసూయ నవ్వుకుంది. పతిని ప్రార్థించి, అతని కమండలంలోని నీళ్ళు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగల్లా చక్కగా ఉడికిపోయాయి. అనసూయను మెచ్చుకొని నమస్కరించి శనగలు పట్టుకుని వెనక్కి వచ్చాడు నారదుడు. వెక్కిరింతగా లక్ష్మీ సరస్వతి పార్వతులకు ఇచ్చి – తనూ తింటూ అనసూయ అంత పతివ్రత ముల్లోకాల్లో లేదన్నాడు. ఆ ముగురమ్మలకు ఈర్ష్య కలిగింది. ఊరుకుంటారా? లేదు భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పుకున్నారు. అసూయ పడ్డారు. అనసూయను అవమానించాలనుకున్నారు. త్రిమూర్తులు ముగ్గురూ అనసూయ ఉన్న ఆశ్రమానికి సాధువుల్లా వెళ్ళారు. భోజనం పెట్టమన్నారు. ఆకలిగా ఉందన్నారు. వండి తెచ్చి వడ్డించబోతే వద్దన్నారు. నగ్నంగా వడ్డించాలని నియమం పెట్టారు. అలాకాకపోతే ఆ ఇంట తినమని లేచి వెళ్ళబోయారు. ఆపింది. అంగీకరించింది. అసలు వచ్చిందెవరో దివ్యదృష్టితో తెలుసుకుంది. భర్తను ప్రార్థించి కమండలం అందుకొని ఒళ్ళంతా తన కురులను కప్పుకొని వచ్చింది. జలాన్ని మంత్రించి ముగ్గురి మీద వేసింది. త్రిమూర్తులు పసిపిల్లలయి పోయారు. వడ్డించింది. తిన్నారు. వాళ్ళని పసి బిడ్డలుగా చేసి ఉయ్యాల్లో వేసింది. అది చూసి అత్రి మహాముని సంతోషించాడు. అక్కడ నారదుడు జరిగింది చెప్పడంతో భర్తలకోసం బావురుమంటూ వచ్చారు సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. వారి భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించింది అనసూయ. వరములడిగితే మీవంటి పుత్రులు కావాలని కోరుకుంది అనసూయ.

సూర్యుణ్ని ఉదయించ వద్దంది కౌశికుని భార్య. ఉదయిస్తే తన భర్త మరణిస్తాడని అలా శాసించింది. సూర్యుడు రాలేదు. అంతా అంధకారం. లోకమంతా చీకటి. బ్రహ్మను ప్రార్థిస్తే కూడా తన వల్ల కాదన్నాడు. అనసూయని అర్థించమన్నాడు. అనసూయ కౌశికుని భార్యను ఉపహరించుకోమన్నది. సూర్యుని రాక. కౌశికుని ప్రాణం పోక. ఒకేసారి జరిగింది. తన పాతివ్రత్య శక్తితో అనసూయ కౌశికునికి తిరిగి ప్రాణాలు పోసింది. వరాలిచ్చిన త్రిమూర్తుల్లో శివుడు దూర్వాసుడుగా, విష్ణువు దత్తాత్రేయుడిగా అనసూయ కడుపున పుట్టారు.

రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శిస్తారు. అనసూయ ఆదరిస్తుంది. సీతకు తన నగలూ సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తుంది. సర్వమంగళమైన మైపూత చీరనూ యిస్తుంది. ఆ అలంకరణ అనసూయ చెప్పినట్టు ఎప్పటికీ చెక్కు చెదరదు. మాసిపోదు. సతీ ధర్మాలనూ భోదించింది. అలా అనసూయ పురాణాల్లో నిలిచిపోయింది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News