కాంగ్రెస్‌తోనే బెంగాల్లో అభివృద్ధి: రాహుల్‌

రాష్ట్రంలో జౌళి పరిశ్రమలు క్రమక్రమంగా మూతపడుతున్నాయి. ఆ నేపథ్యంలో నిరుద్యోగులుగా మారుతున్న జౌళి కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ వెన్నంటే నిలుస్తుందని ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ హామీ ఇచ్చారు. శనివారం కలకత్తాలో జౌళి కార్మికులతో రాహుల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామ‌ని రాహుల్ చెప్పారు. జౌళి పరిశ్రమలో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు అండగా ఉంటామని  రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. గతంలో వామపక్షాలు, ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిపాలనలో బెంగాల్‌ […]

Advertisement
Update: 2015-06-06 06:05 GMT
రాష్ట్రంలో జౌళి పరిశ్రమలు క్రమక్రమంగా మూతపడుతున్నాయి. ఆ నేపథ్యంలో నిరుద్యోగులుగా మారుతున్న జౌళి కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ వెన్నంటే నిలుస్తుందని ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ హామీ ఇచ్చారు. శనివారం కలకత్తాలో జౌళి కార్మికులతో రాహుల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామ‌ని రాహుల్ చెప్పారు. జౌళి పరిశ్రమలో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు అండగా ఉంటామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. గతంలో వామపక్షాలు, ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిపాలనలో బెంగాల్‌ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలన వస్తేనే బెంగాల్‌లో అభివృద్ధి సాధ్యమని రాహుల్‌ స్పష్టం చేశారు.
Tags:    
Advertisement

Similar News