జ‌గ‌న్ సమరదీక్షకు మంగ‌ళ‌గిరిలో సన్నద్ధం

గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ వద్ద ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చేనెల 3, 4 తేదీల్లో చేపట్టనున్న సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమరదీక్ష చేపట్టనున్న స్థలంలో భూమిపూజ చేశారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కన్వీనరు తలశిల రఘురామ్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్, ఎస్సీసెల్ కన్వీనర్లు […]

Advertisement
Update: 2015-05-31 08:11 GMT

గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ వద్ద ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చేనెల 3, 4 తేదీల్లో చేపట్టనున్న సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమరదీక్ష చేపట్టనున్న స్థలంలో భూమిపూజ చేశారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కన్వీనరు తలశిల రఘురామ్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్, ఎస్సీసెల్ కన్వీనర్లు పూనూరు గౌతంరెడ్డి, మేరుగ నాగార్జున ,రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించిన విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని నేతలు ప్రతినబూనారు. కాగా సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐదు ప్రధాన అంశాల్లో బాబు ప్రజల్ని మోసగించిన విధానాన్ని వివరిస్తున్నారు. రాజధాని పేరుతో బాబు నిర్వహిస్తున్న రియల్ వ్యాపార చిదంబర రహస్యాన్ని పేర్కొంటున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు చెందిన ప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నేతలు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరిహద్దునే ఉన్న కృష్ణాజిల్లా నేతలు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతల్లో భాగస్వాములవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News