హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ దిలీప్‌ 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్‌ దిలీప్‌ బాబాసాహెబ్‌ భోస్లేకు అప్పగించారు. కేంద్ర న్యాయశాఖ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌ సేన్‌ గుప్తా పదవీ విరమణ నేపథ్యంలో… ఆయన తర్వాత అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ దిలీప్‌కు తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి హోదా కల్పించారు.ఆయన నియామకం వెంట‌నే అమలులోకి వస్తుందని న్యాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్నతస్థాయి న్యాయ నియామకాలపై అనిశ్చితి నెలకొన్న […]

Advertisement
Update: 2015-05-08 17:15 GMT
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్‌ దిలీప్‌ బాబాసాహెబ్‌ భోస్లేకు అప్పగించారు. కేంద్ర న్యాయశాఖ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌ సేన్‌ గుప్తా పదవీ విరమణ నేపథ్యంలో… ఆయన తర్వాత అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ దిలీప్‌కు తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి హోదా కల్పించారు.ఆయన నియామకం వెంట‌నే అమలులోకి వస్తుందని న్యాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్నతస్థాయి న్యాయ నియామకాలపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. కొలీజియం వ్యవస్థను రద్దు చేసిన ఎన్డీయే సర్కారు జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను (ఎన్‌జేఏసీ) ఏర్పాటు చేసింది. దీని చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఎన్‌జేఏసీ తన విధులు ఇంకా మొదలు పెట్టలేదు. ఇంతలోనే ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకంపై భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం లేదని న్యాయశాఖ వర్గాలు చెప్పాయి.
Advertisement

Similar News