Telugu Global
NEWS

హైదరాబాద్ లో ఏడాది తర్వాత టెస్ట్ మ్యాచ్

విండీస్ పై సిరీస్ స్వీప్ కు టీమిండియా రెడీ ఐదురోజుల సమరమా?…మూడురోజుల ముచ్చటేనా? యువఆటగాళ్లకు చోటువైపు టీమిండియా చూపు మయాంక్, సిరాజ్ లను ఊరిస్తున్న టెస్ట్ క్యాప్ టీమిండియా- వెస్టిండీస్ జట్ల…టెస్ట్ సిరీస్ ఆఖరి మ్యాచ్ కు…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాజ్ కోట టెస్టులో విండీస్ ను మూడురోజుల్లోనే చిత్తు చేసిన.. టాప్ ర్యాంకర్ టీమిండియా సిరీస్ స్వీపే లక్ష్యంగా పోటీకి దిగుతోంది. మరోవైపు …మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్…తన […]

హైదరాబాద్ లో ఏడాది తర్వాత టెస్ట్ మ్యాచ్
X
  • విండీస్ పై సిరీస్ స్వీప్ కు టీమిండియా రెడీ
  • ఐదురోజుల సమరమా?…మూడురోజుల ముచ్చటేనా?
  • యువఆటగాళ్లకు చోటువైపు టీమిండియా చూపు
  • మయాంక్, సిరాజ్ లను ఊరిస్తున్న టెస్ట్ క్యాప్

టీమిండియా- వెస్టిండీస్ జట్ల…టెస్ట్ సిరీస్ ఆఖరి మ్యాచ్ కు…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాజ్ కోట టెస్టులో విండీస్ ను మూడురోజుల్లోనే చిత్తు చేసిన.. టాప్ ర్యాంకర్ టీమిండియా సిరీస్ స్వీపే లక్ష్యంగా పోటీకి దిగుతోంది. మరోవైపు …మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్…తన హోంగ్రౌండ్ లో టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

హైదరాబాద్ లో టెస్ట్ షో

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, ఎనిమిదో ర్యాంకర్ వెస్టిండీస్ జట్ల …రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ షో….సౌరాష్ట్రలోని రాజ్ కోట నుంచి…..తెలంగాణాలోని హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి చేరింది.

ఏడాది విరామం తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ కోసం…హైదరాబాద్ క్రికెట్ సంఘం…విస్త్రృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

హాట్ ఫేవరెట్ టీమిండియా….

మూడురోజుల ముచ్చటగా ముగిసిన రాజ్ కోట టెస్టులో…. అతిపెద్ద విజయం సాధించిన టీమిండియా…. హైదరాబాద్ టెస్టులో సైతం…. అదేస్థాయి విజయం తో…. సిరీస్ స్వీప్ సాధించాలన్న ఆత్మవిశ్వాసంతో పోటీకి దిగుతోంది.

మరోవైపు…. తొలిటెస్టులో చిత్తుగా ఓడిన కరీబియన్ టీమ్ మాత్రం….. పవర్ ఫుల్ టీమిండియాను రెండోటెస్టులో… ఏవిధంగా ఎదుర్కొనాలో తెలియక అయోమయంలో చిక్కుకొంది.

టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమిండియాకు…. 8వ ర్యాంకర్ విండీస్ ఏవిధంగానూ సమఉజ్జీగా కనిపించడం లేదు.

సిరాజ్ కు టెస్ట్ క్యాప్ చిక్కేనా?

రాజ్ కోట టెస్ట్ ద్వారా…యువ ఓపెనర్ పృథ్వీ షాకు టెస్ట్ క్యాప్ ఇచ్చిన భారత టీమ్ మేనేజ్ మెంట్… హైదరాబాద్ టెస్ట్ లో…. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు, మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లను… టెస్ట్ అరంగేట్రం చేయించే అవకాశాలు లేకపోలేదు.

ఇక… మ్యాచ్ కు వేదికగా ఉన్న రాజీవ్ స్టేడియంలో…. స్పిన్ బౌలింగ్ కు అనువుగా పిచ్ ను సిద్ధం చేశారు. మొదటి రెండురోజులూ బ్యాటింగ్ కు… చివరి మూడురోజులు స్పిన్ బౌలర్లకు వికెట్ అనుకూలించేలా ఏర్పాట్లు చేశారు.

రాజీవ్ స్టేడియంలో ఐదోటెస్ట్….

2010 నుంచి 2017 సీజన్ వరకూ కేవలం నాలుగంటే నాలుగు టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే ఆతిథ్యమిచ్చిన రాజీవ్ స్టేడియం…. ఆతిథ్య టీమిండియాకు విజయాల అడ్డాగా ఉంది.

ఇప్పటి వరకూ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లతో మ్యాచ్ లు ఆడిన టీమిండియాకు…. మూడు భారీవిజయాలు, ఓ డ్రా రికార్డు ఉన్నాయి.

హైదరాబాద్ టెస్టులో సైతం …. టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు…. ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా… భారీస్కోరుతో మ్యాచ్ పై పట్టు బిగించే వ్యూహాన్ని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయి.

అయితే…. తొలిటెస్ట్ మాదిరిగానే…. హైదరాబాద్ టెస్టులో సైతం విండీస్ మూడురోజుల్లోనే చేతులెత్తేస్తుందా? లేక…. పూర్తిస్థాయిలో పుంజుకొని ఆడి… టీమిండియాను ఐదురోజులపాటు నిలువరించగలదో? తెలుసుకోవాలంటే…. మొదటి మూడురోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  11 Oct 2018 5:41 AM GMT
Next Story