Telugu Global
NEWS

విరాట్ కొహ్లీ పరుగుల అడ్డా హైదరాబాద్

25వ శతకానికి టీమిండియా కెప్టెన్ తహతహ 2017 హైదరాబాద్ టెస్టులో బంగ్లాపై కొహ్లీ 200 నాటౌట్ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి….హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి అవినాభావ సంబంధమే ఉంది. గత ఏడాది హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో… అజేయ డబుల్ సెంచరీ సాధించిన కొహ్లీ…మరికొద్ది గంటల్లో విండీస్ తో ప్రారంభమయ్యే రెండోటెస్ట్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే 24 టెస్ట్ సెంచరీలు సాధించిన కొహ్లీ… 25వ […]

విరాట్ కొహ్లీ పరుగుల అడ్డా హైదరాబాద్
X
  • 25వ శతకానికి టీమిండియా కెప్టెన్ తహతహ
  • 2017 హైదరాబాద్ టెస్టులో బంగ్లాపై కొహ్లీ 200 నాటౌట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి….హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి అవినాభావ సంబంధమే ఉంది. గత ఏడాది హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన సింగిల్ టెస్ట్ మ్యాచ్ లో… అజేయ డబుల్ సెంచరీ సాధించిన కొహ్లీ…మరికొద్ది గంటల్లో విండీస్ తో ప్రారంభమయ్యే రెండోటెస్ట్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే 24 టెస్ట్ సెంచరీలు సాధించిన కొహ్లీ… 25వ టెస్ట్ శతకానికి గురిపెట్టాడు.

సచిన్ వారసుడు….

విరాట్ కొహ్లీ….భారత క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న మొనగాడు.

టెస్ట్ క్రికెట్…వన్డే క్రికెట్ అన్నతేడా లేకుండా పరుగులహోరు, సెంచరీల జోరు కొనసాగిస్తున్న ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాట్స్ మన్.

హైదరాబాద్ వేదికగా గత ఏడాది బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో…డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కొహ్లీ… ఇప్పుడు విండీస్ తో…మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే రెండోటెస్టులో సైతం అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

రాజ్ కోట టెస్టులో జోరు…

రాజ్ కోట వేదికగా ముగిసిన తొలిటెస్ట్ లో విండీస్ పై 139 పరుగులతో….తన కెరియర్ లో 24వ టెస్ట్ శతకం సాధించిన కొహ్లీ…. 25వ సెంచరీకి గురిపెట్టాడు.

ఇప్పటి వరకూ ఆడిన 72 టెస్టుల్లో 24 శతకాలతో సహా…మొత్తం 6 వేల 286 పరుగులతో 54.66 సగటు సాధించిన రికార్డు కొహ్లీకి ఉంది.

అంతేకాదు… హైదరాబాద్ టెస్టులో సైతం కొహ్లీ శతకం సాధించగలిగితే…. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ పేరుతో ఉన్న 25 సెంచరీల రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

సచినే టాప్….

టెస్ట్ క్రికెట్ చరిత్రలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 200 టెస్టుల్లో 51 సెంచరీలతో సహా 15 వేల 921 పరుగులతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

విరాట్ కొహ్లీ మాత్రం…24 సెంచరీలు, 6వేల 286 పరుగులతో టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితా… 21వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం…ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా ఉన్న… విరాట్ కొహ్లీ… కుదురుకోగలిగితే…. హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో… బ్యాక్ టు బ్యాక్ సెంచరీల రికార్డు పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు.

First Published:  10 Oct 2018 11:59 AM GMT
Next Story