Telugu Global
Health & Life Style

ఐర‌న్ లోపిస్తే ఎన్నో క‌ష్టాలు!

మ‌నం త‌ర‌చుగా ఐర‌న్ లోపం గురించి వింటుంటాం. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో, చిన్న పిల్ల‌ల్లో ఐర‌న్ లోపం గురించి వైద్యులు వివ‌రిస్తుంటారు. మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కావ‌డానికి హెమోగ్లోబిన్ తోడ్ప‌డుతుంది. ఆ హెమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ అవ‌స‌రం. ఐర‌న్ లోపిస్తే ర‌క్త‌హీన‌త‌కు దారితీస్తుంది. అందువ‌ల్ల ఐర‌న్ లోపం వ‌ల్ల త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ను నివార‌ణ మార్గాల‌ను చూద్దాం. – ఐర‌న్ లోపం వ‌ల్ల తీవ్ర అల‌స‌ట ఉంటుంది. చిన్న చిన్న ప‌నుల‌కే ఎక్కువ అల‌సిపోతారు. అల‌స‌ట‌తో […]

ఐర‌న్ లోపిస్తే ఎన్నో క‌ష్టాలు!
X
మ‌నం త‌ర‌చుగా ఐర‌న్ లోపం గురించి వింటుంటాం. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో, చిన్న పిల్ల‌ల్లో ఐర‌న్ లోపం గురించి వైద్యులు వివ‌రిస్తుంటారు. మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కావ‌డానికి హెమోగ్లోబిన్ తోడ్ప‌డుతుంది. ఆ హెమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ అవ‌స‌రం. ఐర‌న్ లోపిస్తే ర‌క్త‌హీన‌త‌కు దారితీస్తుంది. అందువ‌ల్ల ఐర‌న్ లోపం వ‌ల్ల త‌లెత్తే స‌మ‌స్య‌ల‌ను నివార‌ణ మార్గాల‌ను చూద్దాం.

– ఐర‌న్ లోపం వ‌ల్ల తీవ్ర అల‌స‌ట ఉంటుంది. చిన్న చిన్న ప‌నుల‌కే ఎక్కువ అల‌సిపోతారు. అల‌స‌ట‌తో పాటు చికాకు, బ‌ల‌హీనంగా మార‌డం, ఏకాగ్ర‌త కుద‌ర‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.
– రోజువారీ ప‌నులు చేస్తున్నా శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా అనిపిస్తుంటింది.
– నిద్ర‌లో కాళ్లు అదేప‌నిగా క‌దుపుతుండ‌డం, మ‌ధ్య‌మ‌ధ్య‌లో గోకుతుండ‌డం ఐర‌న్ లోపానికి సంకేతంగా చెప్ప‌వ‌చ్చు.
– మెద‌డులోని ర‌క్త‌నాళాలు ఉబ్బి త‌ల‌నొప్పిగా ఉంటుంది.
– చిన్న‌పిల్ల‌లు చాక్‌పీస్‌, మ‌ట్టి, కాగితాలు వంటివి తింటుంటే ఐర‌న్‌లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి.
– ఐర‌న్‌లోపం ఉన్న‌వారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అన్ని విష‌యాల‌కూ తీవ్రంగా ఆందోళ‌న చెందుతుంటారు.
– ఐర‌న్ లోపం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మంద‌గిస్తుంది. దానివ‌ల్ల హైపోథారాయిడిజమ్ అనే స‌మ‌స్య త‌లెత్త‌వ‌చ్చు. త్వ‌ర‌గా అల‌సిపోతుండ‌డం, బ‌రువు పెరుగుతుండ‌డం, శ‌రీరం చ‌ల్ల‌గా అనిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.
– ఐర‌న్‌లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని ముందే చెప్పుకున్నాం. దానివ‌ల్ల జుట్టు ఊడిపోతుంది.
– నాలుక మంట పుట్ట‌డం, వాపు చాలా నున్న‌గా మార‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.
– చ‌ర్మం పాలిపోతుంది. పెద‌వుల లోప‌లి భాగంలో, చిగుళ్లు, క‌నురెప్ప‌ల లోప‌ల కూడా ఎరుపుద‌నం తగ్గుతుంది.

ఐర‌న్‌లోపం త‌లెత్త‌కుండా ఉండాలంటే మ‌నం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మ‌రీ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటే వైద్యుని స‌ల‌హాతో మాత్ర‌లు తీసుకోవ‌చ్చు. ప‌ప్పుధాన్యాలు, పాల‌కూర‌, గింజ‌ప‌ప్పులు, చికెన్‌, కాబూలీ శ‌న‌గ‌ల్లో ఇత‌ర పోష‌కాల‌తో పాటు ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది.
Next Story