Telugu Global
WOMEN

చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

శీతాకాలం వచ్చేసింది. మెల్లమెల్లగా చలి జోరందుకుంటోంది. ఇదే సమయం అని రకాల సీజనల్ వ్యాధులు కూడా ఊపందుకుంటాయి.

చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..
X

శీతాకాలం వచ్చేసింది. మెల్లమెల్లగా చలి జోరందుకుంటోంది. ఇదే సమయం అని రకాల సీజనల్ వ్యాధులు కూడా ఊపందుకుంటాయి. ఇలాంటప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలతో రోజు వారీ అలవాట్లు మారిపోతుంటాయి. పొద్దున్నే నిద్రలేవాలంటే ఎక్కడలేని బద్దకం కమ్మేస్తుంది. త్వరగా చీకటి పడి వేరే పనులు తోచనివ్వదు.ఇలాంటి సీజన్ లో అందరు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు

ప్రెగ్నెన్సీ స్త్రీ జీవితంలో అతిముఖ్యమైన అంశం. కానీ, అదే సమయంలో శారీరక, మానసిక ఒత్తిడి రెండూ ప్రభావం చూపుతాయి. హోర్మోన్ల మార్పులు వివిధ ప్రభావాలకు దారితీస్తుంది. చలికాలంలో అందరికీ జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా వస్తాయి. అయితే ప్రెగ్నెన్సీ లో చిన్న చిన్న సమస్యలకు మందులు వాడకూడదు కాబట్టి సరైన వీరు ఇతరుల కంటే అదనంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అసలు గర్భిణీ లే కాదు ప్రతి ఒక్కరూ చలికాలంలో అధికంగా నీళ్లు తాగాలి. తద్వారా శరీరానికి సరిపడా నీళ్లు అందుతాయి. ఫలితంగా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

ఈ కాలంలో వెచ్చదనం కోసం తరచుగా టీ, కాఫీలు తాగుతారు కొందరు. అది అస్సలు మంచిది కాదు. కొబ్బరి నీళ్ళు, జ్యూస్‌లు తాగడం మంచిది.

కాస్త ఆరోగ్యం అనుకూలంగా ఉన్నవారు సున్నితమైన యోగా చేయవచ్చు. క్రమం తప్పని ఫిట్‌నెస్ నియమావళి ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. వెన్నునొప్పి, అలసట వంటి అనేక సాధారణ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం, ఒత్తిడిని తగ్గించడం.. ప్రసవానికి అవసరమైన శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే తగినంత నిద్రతో పాటు.. ఉదయం వేళ సూర్య కిరణాలకు కాసేపు కూర్చోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది.


చలికాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. కాబట్టి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొబ్బరినూనెను ఉపయోగించండి. గర్భధారణ తర్వాత సహజంగానే స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి. చర్మం డ్రైగా మారితే స్ట్రెచ్‌ మార్క్స్‌ మరింత ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఇందుకోసం తరచుగా మాయిశ్చరైజర్ రాసుకోండి. .

First Published:  23 Nov 2023 2:00 AM GMT
Next Story