జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా విజయ కిశోర్ రత్నాకర్
సభ్యురాలిగా అర్చన మజుందార్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
BY Naveen Kamera19 Oct 2024 9:53 AM GMT
X
Naveen Kamera Updated On: 19 Oct 2024 9:53 AM GMT
జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకురాలు విజయ కిశోర్ రత్నాకర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన విజయ మహిళ హక్కుల ఉద్యమంలో కీలకంగా పని చేశారు. బీజేపీలో ముఖ్య నాయకురాలు. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలికి కేంద్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆమె మూడేళ్ల పాటు లేదా.. 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాల జిల్లాకు చెందిన డాక్టర్ అర్చన మజుందార్ ను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారు.
Next Story