Telugu Global
WOMEN

ట్రంప్‌ విక్టరీ.. ఆ మాత్రలకు భారీ గిరాఖీ

ఒక్క రోజులోనే భారీగా పెరిగిన డిమాండ్‌

ట్రంప్‌ విక్టరీ.. ఆ మాత్రలకు భారీ గిరాఖీ
X

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన తర్వాత యూఎస్‌ లో ఆ ట్యాబ్లెట్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడిందట..! ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టానికి ఇంకో రెండు నెలల సమయమున్నా కొందరు ముందు జాగ్రత్త పడుతున్నారట? ఇంతకీ డిమాండ్‌ పెరిగింది వేటికి.. ఎందుకీ ఉపోద్ఘాతమంతా అంటున్నారా... అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు అబార్షన్‌ రైట్‌ ఉంది. అంటే తాము దాల్చిన గర్భాన్ని స్వచ్ఛందంగా మహిళలు విచ్చిత్తి చేసుకోవచ్చు. ట్రంప్‌ గెలుపుతో ఈ రైట్‌ ను తొలగిస్తారని ప్రచారంలో ఉంది. దీంతో ట్రంప్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సమయం నుంచి 24 గంటల్లోనే అబార్షన్‌ పిల్స్‌ కోసం 10 వేలకు పైగా అభ్యర్థులను ఆన్‌లైన్‌ యాప్స్‌ తో పాటు ఆఫ్‌లైన్‌ ద్వారా షాపుల్లో నమోదయ్యాయని చెప్తున్నారు. అబార్షన్‌ పిల్స్‌ ఒక రోజు సాధారణ డిమాండ్‌ కన్నా ఇవి 17 రెట్లు ఎక్కువని అమెరికన్‌ మీడియా కథనాల్లో పేర్కొన్నది. గర్భం దాల్చని వాళ్లు కూడా అబార్షన్‌ పిల్స్‌ కోసం ప్రిస్కిప్షన్‌ ఇవ్వాలని తమను కోరుతున్నారని ఒక ఎన్‌జీవో వెల్లడించింది. అబార్షన్‌ కోసం తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భం దాల్చలేదని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అబార్షన్‌ పిల్స్‌ ఎక్కడ దొరుకుతాయనే ఇన్‌ఫర్మేషన్‌ కోసం నిత్యం నాలుగు వేలు, అంతకన్నా ఎక్కువ మంది తమ వెబ్‌ సైట్‌ సందర్శించే వారని సదరు ఎన్‌జీవో వెల్లడించింది. ట్రంప్‌ విజయం తర్వాత ఇప్పుడు ఒక్కో రోజు తమ వెబ్‌సట్‌ ను 82 వేల మందికి పైగా సందర్శిస్తున్నారని తెలిపింది. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికా లో అబార్షన్‌ హక్కుపై నిషేధం విధిస్తాడనే ఆందోళనతోనే కొందరు ముందస్తుగానే వాటిని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారని నేషనల్‌ అబార్షన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటెనో తెలిపారు.

First Published:  12 Nov 2024 4:29 PM IST
Next Story