Telugu Global
WOMEN

డిప్లొమా, ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు స్కాలర్‌‌షిప్స్! ఎలా అప్లై చేయాలంటే..

ప్రతిభ ఉండి చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులతో చదువుకోలేకపోతున్న విద్యార్థినుల కోసం ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)’ స్కాలప్ షిప్స్ ఆఫర్ చేస్తోంది.

డిప్లొమా, ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు స్కాలర్‌‌షిప్స్! ఎలా అప్లై చేయాలంటే..
X

డిప్లొమా, ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు స్కాలర్‌‌షిప్స్! ఎలా అప్లై చేయాలంటే..

ప్రతిభ ఉండి చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులతో చదువుకోలేకపోతున్న విద్యార్థినుల కోసం ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)’ స్కాలప్ షిప్స్ ఆఫర్ చేస్తోంది. వీటికి ఎవరు అర్హులంటే.

చదువుపై శ్రద్ధ ఉండి ఆర్థికంగా నిలదొక్కులేని వాళ్లకు అండగా నిలవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి.. ‘ప్రగతి స్కాలర్‌‌షిప్స్’ పేరుతో ప్రతి ఏటా పదివేల మందికి స్కాలర్‌‌షిప్స్ అందజేస్తోంది. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థినులు వీటికి అప్లై చేసుకోవచ్చు.

ఎలిజిబిలిటీ ఇదీ

డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు, లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్పులకు అప్లై చేసుకోవచ్చు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ కోర్సులో చేరి ఉండాలి.

ఎంపిక ఇలా

ఈ స్కాలర్‌‌షిప్స్‌.. డిప్లొమా లెవల్లో ఐదువేల మందికి, ఇంజినీరింగ్‌ లెవల్లో ఐదువేల మందికి అందజేస్తారు. డిప్లొమా అభ్యర్థులను టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌‌షిప్‌కు ఎంపిక చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఇంజినీరింగ్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. పెళ్లి అయిన వాళ్లు కూడా అర్హులే. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్స్‌కు రాష్ట్రాలవారీ కోటా ఉంటుంది. డిప్లొమా విభాగంలో ఏపీ నుంచి 318 మందికి, తెలంగాణలో నుంచి 206 మందికి వీటిని అందిస్తారు. అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి, తెలంగాణ నుంచి 424 మందికి అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కేటాయింపులు కూడా ఉంటాయి.

స్కాలర్‌‌షిప్ ఎంతంటే..

స్కాలర్‌‌షిప్‌కు ఎంపికైన విధ్యార్థినులకు ఏడాదికి రూ.50,000 చొప్పున డిప్లొమా వాళ్లకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ వాళ్లకు నాలుగేళ్ల పాటు చెల్లిస్తారు. ప్రతి ఏటా విద్యార్థినుల బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా డబ్బు జమ చేస్తారు. వీటిని ఫీజు, వసతి, పుస్తకాల వంటి ఖర్చుల కోసం వాడుకోవచ్చు.

అభ్యర్థులు ‘ఏఐసీటీఈ’ వెబ్‌సైట్(www.aicte-india.org) లో అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. డిసెంబరు 31 వరకూ అప్లికేషన్స్ స్వీకరిస్తారు.

First Published:  15 Oct 2023 6:15 AM GMT
Next Story