Telugu Global
WOMEN

క్లీన్‌ గర్ల్ బ్యూటీ ట్రెండ్‌ గురించి తెలుసా?

ఆడవాళ్ల మేకప్‌లో రకరకాల కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఒకప్పుడు మేకప్ అంటే లేయర్లు కొద్దీ వేసుకునేవాళ్లు.

క్లీన్‌ గర్ల్ బ్యూటీ ట్రెండ్‌ గురించి తెలుసా?
X

ఆడవాళ్ల మేకప్‌లో రకరకాల కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఒకప్పుడు మేకప్ అంటే లేయర్లు కొద్దీ వేసుకునేవాళ్లు. చూడ్డానికి కాస్త ఆర్భాటంగా కనిపించేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. వీలైనంత సహజంగా కనిపించడం కోసం ముఖానికి ప్రత్యేకమైన టచ్‌అప్ ఇస్తున్నారు. దీన్నే ‘క్లీన్ గర్ల్ లుక్’ అంటున్నారు.

ఎలాంటి మేకప్ లేనట్టు కనిపించేలా మేకప్ వేసుకోవడమే ఈ క్లీన్ గర్ల్ లుక్ ప్రత్యేకత. బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లి లుక్స్‌ను చూస్తే ఇది అర్థమవుతుంది. ఈ క్లీన్ గర్ల్ లుక్ కోసం ఎలాంటి మేకప్ టిప్స్ పాటించాలంటే..

ఎలాంటి మేకప్‌కైనా ముందుగా ఫౌండేషన్ ముఖ్యం. అయితే ఈ ఫౌండేషన్‌ ఫుల్‌గా కాకుండా స్కిన్ డల్‌గా ఉన్నచోట మాత్రమే అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖంపై ఉన్న మచ్చల్ని కవర్ చేయడానికి కన్సీలర్‌‌కు బదులు లూజ్ పౌడర్‌‌ను వాడాలి. స్కిన్ కలర్‌‌కు దగ్గరగా ఉన్న పౌడర్‌‌ను ఎంచుకుంటే మంచిది.

అన్నింటికంటే ముఖ్యంగా మేకప్‌లో బుగ్గలపై ఎరుపురంగు బ్లష్ చేస్తుంటారు చాలామంది. అయితే క్లీన్ గర్ల్ లుక్ కావాలంటే దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. స్కిన్ అంతా ఒకే టోన్‌లో సహజంగా కనిపించడం ఈ లుక్ ఉద్దేశం కాబట్టి బ్లషింగ్ చేయకూడదు.

కనుబొమ్మల మేకప్ కోసం లైట్‌గా ఐబ్రో జెల్.. అలాగే కనురెప్పల అందం కోసం లైట్‌గా మస్కారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఐబ్రోస్‌ను అదనంగా క్రియేట్ చేయకుండా ఉన్నవాటినే హైలైట్ చేయాలి.

క్లీన్‌ గర్ల్‌ లుక్‌ కోసం లిప్‌స్టిక్ ఎబ్బెట్టుగా కనిపించకుండా చూసుకోవాలి. దీనికోసం న్యూడ్ లిప్‌స్టిక్ వాడొచ్చు.

ఇక చివరిగా ఈ లుక్‌ను అచీవ్ చేయడం కోసం మేకప్ తరహాలోనే ఇతర స్టైలింగ్‌లో కూడా సింప్లిసిటీ మెయింటెయిన్ చేయాలి. అదనపు హంగులు తగ్గించి సింపుల్ హెయిర్ స్టైల్, లైట్ కలర్ డ్రెస్సింగ్‌తో పాటు ఆభరణాలు కూడా వీలైనన్ని తక్కువ ధరించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పెళ్లిళ్లు, పార్టీల్లో నేచురల్ బ్యూటీలా మెరిసిపోవచ్చు.

First Published:  28 March 2024 5:29 AM GMT
Next Story