Telugu Global
WOMEN

మహిళలు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ప్రారంభించాలంటే..

ఒకప్పుడు ఆడపిల్లకి చాకలి పద్దు రాయడం వస్తే చాలు.. వాళ్ళేమన్నా ఉద్యోగం చెయ్యాలా.. ఊళ్ళు ఏలాలా అన్న మాట వినకుండా ఏ ఆడపిల్లా పెరగలేదు.. తరువాత కాలం చాలా మారింది..

మహిళలు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ప్రారంభించాలంటే..
X

ఒకప్పుడు ఆడపిల్లకి చాకలి పద్దు రాయడం వస్తే చాలు.. వాళ్ళేమన్నా ఉద్యోగం చెయ్యాలా.. ఊళ్ళు ఏలాలా అన్న మాట వినకుండా ఏ ఆడపిల్లా పెరగలేదు.. తరువాత కాలం చాలా మారింది.. ఇప్పుడు..చదువు, ఉద్యోగం వరుసలో పెళ్లి పిల్లలు. ఇంక మొదలయ్యింది అసలు జీవితం.. చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు ఉన్న నేను.. ఇప్పుడు ఎక్కడున్నానో అని ఆలోచించని మహిళ ఉండదు ఈ కాలంలో.. వేరే అవకాశాలు లేక.. పాత ఉద్యోగంలోకి వెళ్లలేక, కొత్త వారితో పోటీ పడలేక అసలు ఏం చెయ్యాలో తెలియక సతమతం అయిపోయే వాళ్ళు ఎందరో..రోజులు గడిచే కొద్ది తనేమీ చేయలేకపోతున్నానే నిస్సహాయత కుంగుబాటుకు దారితీస్తుంది. ఇలాంటి అప్పుడు జీవితాన్ని తిరిగి దారిలో పెట్టుకోవాలన్నా, నూతన ఉత్సాహంతో అడుగులు వేయాలన్నా ఈ సూత్రాలు మీకు ఎంతో తోడ్పడతాయి.



మనకి ఎన్నో సమస్యలున్నాయి. నిజమే.. కానీ అంతకు ముందు సమస్యలు రాలేదా.. పాతవి పోతాయి.. కొత్తవి వస్తాయి.. మనతో ఎప్పుడూ నిలవని వాటికోసం మనం ఎందుకు ఆలోచించాలి. కాబట్టి వాటికంటే ముందు మీకు ఏది ఇష్టమో దాని గురించి ఆలోచించండి.

మొక్కల పెంపకం, కుట్లు అల్లికలు, టెక్నాలజీ, ఫ్యాషన్ మీకు ఒకప్పుడు నచ్చిన రంగం. మీరు దానిలో అప్డేట్ అయి ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు కొత్తగా నచ్చిన వాటి గురించి తెలుసుకోవటం మొదలు పెట్టండి. మీకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ఇప్పుడు మీ ఎన్నిక మీద మీకు నమ్మకం ఏర్పాటయ్యాక దానిని స్వయం ఉపాధిగానో, అభిరుచి గానో ఏర్పరుచుకోవాలంటే అప్పుడే జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టినట్టుగా అటువైపు అడుగులు వేయండి. ఎందుకంటే ఇష్టంతో చేసే పనిలో త్వరగా విజయం సాధిస్తారు.



అలా కాకుండా పాత కెరియర్ మళ్ళీ ప్రారంభిద్దామని అనుకున్నా కూడా దానిపై కూడా కొంత శోధన చేయండి.

తిరిగి అడుగు పెట్టడానికి అవసరమైన నైపుణ్యాలన్నీ సమకూర్చుకోండి. కొన్ని కంపెనీలు తమ దగ్గర చేసి మానేసిన మహిళల కోసం ప్రత్యేకంగా కోర్సులు డిజైన్ చేసి ఉంచుతున్నాయి. వారికి శిక్షణ ఇచ్చి వారికి ఒక స్థానం కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కెరియర్ లో బ్రేక్ తీసుకున్న వారికి మార్కెట్లో అవసరాలకు తగ్గ సాంకేతికత, విధానాలపై నైపుణ్యాల శిక్షణ అందించి ఉద్యోగ అవసరాలను మెరుగుపరుస్తున్నాయి.

నేను ఈ పని చేయగలను అని గట్టిగా అనుకుంటే మీలోని సానుకుల అంశాలు బలపడతాయి. మీ లక్ష్యం దిశగా మీ ప్రయాణాన్ని సులభం చేస్తాయి.

First Published:  26 Aug 2023 7:30 AM GMT
Next Story