Telugu Global
WOMEN

ఆ గ్రామంలో మహిళలు అయిదు రోజులు దుస్తులు ధరించరు

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్ లోయలో ఉన్న కుల్లు జిల్లాలోని పినీ అనే గ్రామంలో మహిళలు వానాకాలంలో వచ్చే ఓ పండుగ సందర్భంగా అయిదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు.

ఆ గ్రామంలో మహిళలు అయిదు రోజులు దుస్తులు ధరించరు
X

ఆ గ్రామంలో మహిళలు అయిదు రోజులు దుస్తులు ధరించరు

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్ లోయలో ఉన్న కుల్లు జిల్లాలోని పినీ అనే గ్రామంలో మహిళలు వానాకాలంలో వచ్చే ఓ పండుగ సందర్భంగా అయిదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు.

లాహూ ఘోండ్ అనే దేవత రాక్షసులను సంహరించినందుకు ఏటా భాద్రపద మాసంలో మొదటి రోజుని పండుగగా జరుపుకుంటారు. మొత్తం అయిదు రోజుల పాటు వేడుకలు చేసుకుంటారు. రాక్షసుడు మహిళల దుస్తులను చింపేసి వారిని చెరపట్టాలని చూడగా దేవత వాడిని సంహరించినట్టుగా చెబుతారు. అందుకే అయిదు రోజుల పాటు దుస్తులు ధరించకూడదనే సంప్రదాయం వచ్చి ఉంటుందని అంటారు.

పండుగ జరిగే అయిదు రోజులు మహిళలందరూ దుస్తులు లేకుండా ఉండాల్సిందే. అయితే వారు ఊలుతో తయారయిన పట్టాలతో తమ శరీరాన్ని కప్పుకుంటారు. ఒక వేళ ఏ మహిళ అయినా ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తే ఆమె కొన్ని రోజుల్లోనే ఏదో ఒక చెడు వార్తని వినాల్సి వస్తుందని గ్రామస్తులు నమ్ముతారు. సాధారణంగా మహిళలు ఆ అయిదురోజుల పాటు బయటి వ్యక్తులకు కనిపించకుండా తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు. అయితే పెద్ద వయసున్న స్త్రీలు ఇప్పటికీ దీనిని చాలా నిష్టగా పాటిస్తుండగా యువతులు మాత్రం పలుచని వస్త్రాలు ధరిస్తున్నారని తెలుస్తోంది. ఆ అయిదు రోజులు మహిళలు నవ్వకూడదనే నియమం కూడా ఉంది. అలాగే భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉండాలి.

మీడియా కథనాలను బట్టి ఆ అయిదు రోజులపాటు మగవారు కూడా కొన్ని ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. వారు ఆ రోజుల్లో ఆల్కహాల్, మాంసాహారాలను ముట్టుకోకూడదు. ఇవన్నీ సరిగ్గా పాటించకపోతే దేవతలకు కోపం వచ్చి హాని చేస్తారని వారు నమ్ముతుంటారు. దీర్ఘకాలంగా ఈ ఆచారాలు అక్కడ అమల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

First Published:  29 Aug 2023 6:55 AM GMT
Next Story