Telugu Global
WOMEN

మహిళలూ... ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి

మహిళల రక్షణ కోసం పోలీసులు అందించే సేఫ్టీ యాప్స్​ని ఇన్​స్టాల్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్లేప్పుడు. ఫోన్ ​ఫుల్ ఛార్జింగ్ ఉండేలా ముందే చూసుకోండి.

మహిళలూ... ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి
X

ఇప్పటి వరకు ఇలా రెడీ అవ్వండి. మీ అందాన్ని ఇలా కాపాడుకోండి. ఉద్యోగంలో ఎదగాలంటే ఇలా చెయ్యండి అని రాసుకున్నాం, చదువుకున్నాం, తెలుసుకున్నాం.. కానీ ఇప్పడు పరిస్థితి చూస్తే అమ్మాయిలు బతకాలంటే ఇలా ఉండండి. ఒంటరిగా బయటకు వెళితే ఇవి వెంట తీసుకు వెళ్ళండి, మీ హ్యాండ్ బాగ్ లో ఈ వస్తువులు, ఫోన్ లో ఈ యాప్ లు ఉన్నాయా ఒకసారి చూసుకోండి అని చెప్పే కాలం వచ్చింది. ఇదిగో ఈ చిన్ని చిట్కాలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అవేంటంటే..

మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ముందుగానే రైడ్‌ను బుక్ చేసుకోండి. వాహనం ఇంటికి వచ్చేవరకు వేచి ఉండి ఎక్కండి. ఫోన్ లో ఎమర్జెన్సీ కాంటాక్ట్​లు మెయింటైన్​ చేసి వారికి మీ ప్రయాణం గురించి సమాచారం ఇవ్వండి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందించే సేఫ్టీ యాప్స్​ని ఇన్​స్టాల్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్లేప్పుడు. ఫోన్ ​ఫుల్ ఛార్జింగ్ ఉండేలా ముందే చూసుకోండి.

ఎంత హడావిడిలో ఉన్నా, ఏ సమయంలో అయినా మీరు ఎక్కే వాహనాన్ని, దాని నెంబర్ ప్లేట్లను ఫోటో తీయండి. దానిని తెలిసిన వారికి వెంటనే పంపండి. మీరు ఎక్కిన క్యాబ్ డోర్ హ్యాండిల్స్ చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ అద్దాలను ఓపెన్ చేసే ఉంచమని చెప్పండి. వెహికల్ డ్రైవర్ ప్రవర్తన అనుమానంగా అనిపిస్తే రైడ్ పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో మాట్లాడుతూనే ఉండండి అలాగే మీరు ఉన్న లొకేషన్ గురించి క్యాబ్ డ్రైవర్ కి వినపడేలాగానే చెబుతూ ఉండండి.

కొందరు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఇది షార్ట్ కట్ మేడమ్ అంటూ కొత్త కొత్త రోడ్లలోకి తీసుకు వెళతారు. అలాంటివి వద్దని చెప్పండి. జనాలు తిరిగే మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళమనండి. అప్రమత్తంగా ఉండి సరైన రూట్లోనే వెళ్తున్నాడో లేదో చూసుకోండి. గుర్తుతెలియని వ్యక్తులు మీ క్యాబ్‌ను లేదా ఆటోను ఆపి మధ్యలో ఎక్కుతుంటే వెంటనే దిగిపోండి.

భద్రత కోసం మీ దగ్గర ఎప్పుడూ పెప్పర్ స్ప్రే లేదా సేఫ్టీ టార్చ్ ను ఉంచుకోండి. హ్యాండ్ బాగ్ లోపల ఎక్కడో మూలన పడేయం కాకుండా అందుబాటులో ఉంచుకోండి స్ప్రే కళ్ళల్లో కొడితే మండిపోతుంది.అలాగే సేఫ్టీ టార్చ్ తో షాక్ ఇస్తే కాసేపు స్తంభించిపోతారు. అప్పుడు మీరు తప్పించుకోవటానికి సమయం దొరుకుతుంది.

First Published:  21 Aug 2024 12:23 PM GMT
Next Story