Telugu Global
WOMEN

అందాన్ని పెంచే ఐదు రకాల పండ్లు

ప్రతి రోజూ ఏదన్నా పండు తిన్నా ఒక కప్పు ఫ్రూట్ జ్యూస్ తాగినా మన చర్మానికి నిగారింపు వస్తుందనే విషయం మనకు తెలిసిందే.

అందాన్ని పెంచే ఐదు రకాల పండ్లు
X

ప్రతి రోజూ ఏదన్నా పండు తిన్నా ఒక కప్పు ఫ్రూట్ జ్యూస్ తాగినా మన చర్మానికి నిగారింపు వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అలాగే కొన్ని పండ్ల రసాలను ఫేసియల్ గా ఉపయోగిస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. నిజానికి చర్మ సౌందర్యం కోసం లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడడం వల్ల వాటిలో ఉండే రసాయనాల దుష్ప్రభావం చర్మంపై పడే ప్రమాదం ఉంది. కానీ ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చక్కని చర్మ సంరక్షణ సులభంగా సాధ్యపడుతుంది. అలా చర్మాన్ని యవ్వనంగా ఉంచే పళ్ళలో అరటి, ఆరెంజ్, యాపిల్, నిమ్మ, బొప్పాయి పండ్లు ముఖ్యమైనవి.



ఈ లిస్ట్ లో ముందుగా చెప్పకోవాల్సినది అరటిపండు. మనకి సంవత్సరం మొత్తం లభించే పండు ఇదొక్కటే. ఇందులో ఉంటే ఐరన్, మెగ్నిషియం, పోటాషియం వంటివి చర్మ నిగారింపునకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అరటి పండులో ఏ, బీ, ఈ విటమిన్స్ చర్మం మంచి రంగులోకి మారడానికి సహాయ పడతాయి.

ఇక రెండవ ముఖ్యమైనది నిమ్మ. ఇందులో ఉండే విటమిన్ సీ చర్మంపై ముఖ్యంగా మోచేతులపై ఉండే నల్లటి మచ్చలను, ముడతలను పోగొడతాయి. అలాగే యాపిల్ ఈ పండు వల్ల కూడా చాలా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాధారణమైన చర్మం కలవారికి యాపిల్‌తో ఫేస్‌ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. యాపిల్ ని చిన్న, చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. తర్వాత ఇందులో కాస్త తేనె, రోజ్ వాటర్ కలుపుకోండి. ఆ తర్వాత ఆ ఫేస్‌ప్యాక్‌ను మీ చర్మంపై పూయండి. ఇలా కొన్నిరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే, నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మపు నిగారింపు రెట్టింపు అవుతుంది. చర్మం పొడిబారడం, పగుళ్లు వంటి సమస్యలుండవు.

ఇక ఆరెంజ్ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి దానిని నేచరల్ స్రబ్ గా ఉపయోగించుకోవచ్చు. చర్మ సౌందర్యానికి బొప్పాయి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండు రసాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులను తగ్గించేందకు ఇది చక్కగా పని చేస్తుంది.

First Published:  1 Oct 2023 11:13 AM GMT
Next Story