Telugu Global
WOMEN

ఐస్ ఫేషియల్ ఎలా చేయాలో తెలుసా?

ఎలాంటి ఫేషియల్ క్రీములు వాడకుండా కేవలం ఐస్ క్యూబ్స్‌తోనే చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చని తెలుసా? ఐస్ క్యూబ్స్‌తో ప్రతిరోజూ ఫేషియల్ చేసుకోవడం ద్వారా చర్మం కమిలిపోకుండా ఉండడమే కాకుండా మరింత యవ్వనంగా మారుతుంది.

ఐస్ ఫేషియల్ ఎలా చేయాలో తెలుసా?
X

ఐస్ ఫేషియల్ ఎలా చేయాలో తెలుసా?

ఎలాంటి ఫేషియల్ క్రీములు వాడకుండా కేవలం ఐస్ క్యూబ్స్‌తోనే చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చని తెలుసా? ఐస్ క్యూబ్స్‌తో ప్రతిరోజూ ఫేషియల్ చేసుకోవడం ద్వారా చర్మం కమిలిపోకుండా ఉండడమే కాకుండా మరింత యవ్వనంగా మారుతుంది. ఐస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలంటే..

ఐస్ ఫేషియల్ చేయడం ఎంతో ఈజీ. ఈ ఫేషియల్‌ను రెండు విధాలుగా చేయొచ్చు. ముందుగా కొన్ని ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని వాటిని పల్చటి క్లాత్‌ లేదా నీళ్లు పీల్చని బట్టలో ఉంచి ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా ఐదు నుంచి పది నిముషాల పాటు చేస్తే చాలు. ఇక రెండో పద్ధతిలో ఒక టబ్‌ లేదా వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో చల్లని నీరు పోసి కొన్ని ఐస్ ముక్కలు వేసి ఆ టబ్‌లో ముఖాన్ని ముంచాలి. దీన్నే ‘ఐస్ వాటర్ ఫేస్ డిప్’ అని కూడా అంటారు. ఇలా చల్లని నీటిలో ముఖాన్ని ముప్ఫై సెకన్ల పాటు ఉంచినా చాలు.

ఐస్ ఫేషియల్.. చాలామంది సెలబ్రిటీల బ్యూటీ రొటీన్‌లో ఉంటుంది. ఐస్ ఫేషియల్ లేదా ఐస్‌డిప్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే టెక్నిక్. ముఖం మీది చర్మానికి ఐస్‌తో మ‌సాజ్‌ చేయడం వల్ల చర్మంలో ర‌క్తప్రస‌ర‌ణ మెరుగుపడి.. ముఖం మరింత తాజాగా, అందంగా మారుతుంది. చల్లదనం వల్ల ముఖంలోని కండరాలు, చర్మం బిగుతుగా మారతాయి. తద్వారా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటుంది.

అన్నిరకాల చర్మ తత్వాలకు ఐస్ ఫేషియల్ సూట్ అవుతంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఐస్‌తో ముఖంపై మసాజ్ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు, మురికి వ‌దిలిపోయి ముఖం పొడిగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లకు చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా ఐస్‌ ఫేషియల్ సాయపడుతుంది.

బయటకు వెళ్లి వచ్చినప్పుడు స్కిన్‌ను డీటాక్స్ చేసుకునేందుకు ఐస్ డిప్ చక్కగా పనికొస్తుంది. అంతేకాదు చర్మ సమస్యలు, డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవడానికి కూడా ఈ ఫేషియల్ బెస్ట్ టెక్నిక్. అయితే ఐస్ ఫేషియల్ లేదా ఐస్ డిప్ అనేది రోజులో ఒకసారి మాత్రమే చేయాలి. ఐస్‌తో ముఖాన్ని ఎక్కువ సార్లు రుద్దితే చర్మం సున్నితత్వం కోల్పోయే వీలుంది. చర్మానికి అదనపు పోషణ అందాలనుకుంటే ఐస్ డిప్ చేసే నీళ్లలో.. రోజ్ వాటర్ లేదా నిమ్మరసం, కలబంద గుజ్జు, టొమాటో గుజ్జు, కీరా ముక్కల వంటివి కూడా కలుపుకోవచ్చు.

First Published:  30 Sep 2023 9:30 AM GMT
Next Story