Telugu Global
WOMEN

వయసు పెరుగుతున్నా… అందం తగ్గకూడదు అంటే ఇలా చేయండి

కాలం మారుతోంది.. రోజులు గడుస్తున్నాయి అంటే అర్థం వయసు పెరుగుతోందనే కదా.. కానీ వయసుతో పాటు అనుభవమైతే పెరుగుతుంది కానీ అందం మాత్రం తగ్గుతుంది.

వయసు పెరుగుతున్నా… అందం తగ్గకూడదు అంటే ఇలా చేయండి
X

కాలం మారుతోంది.. రోజులు గడుస్తున్నాయి అంటే అర్థం వయసు పెరుగుతోందనే కదా.. కానీ వయసుతో పాటు అనుభవమైతే పెరుగుతుంది కానీ అందం మాత్రం తగ్గుతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ ముఖంలో మెరుపు, కోమలత్వం, మృదుత్వం ఏమాత్రం తగ్గకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. అవేమిటో చూద్దామా..!

అలవాటు అయిపోయింది అని వాడేస్తున్నాం గానీ నిజానికి సబ్బులు ముఖ చర్మానికి హాని చేస్తాయి.. వాటికి బదులు ముఖానికి ఫేస్ వాష్ మంచిది. అది మీ చర్మపు సున్నితత్వాన్ని కాపాడుతుంది.

తక్కువ రసాయనాలున్న, నాణ్యమైన క్లేన్సర్లు, టోనర్లు, మాయిశ్చరైజర్లను మాత్రమే ఎంచుకోవాలి.


అలాగే బయటకు వెళ్ళినప్పుడల్లా సన్ స్క్రీన్ లోషన్ ను తప్పనిసరిగా రాసుకోవాలి.అలా అని వేసవికాలం మాత్రమే కాదు ఏడాదంతా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి.

ఆహార విషయంలో కూడా కాస్త ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజూ తీసుకునే ఆహారపదార్ధాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి.

రోజూ క్రమం తప్పకుండా పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు తాగాలి.

వేసుకున్న మేకప్ ను చక్కని క్లెన్సర్ తో తొలగించుకోవాలి. అలాగే ఆ తర్వాత మయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మరచిపోకూడదు.

నిద్రపోయే ముందు చర్మ తత్వాన్ని బట్టి మంచి నైట్ క్రీం తక్కువ మోతాదులో రాసుకోవాలి.

చివరిగా…చాలీచాలని నిద్రపోయిన వారికంటే , 8 గంటలపాటు నిద్రపోయినవారి ముఖం కళకళలాడుతుంది.. సో మంచిగా పడుకోవటం కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా ఇటు వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ అందం మీతోనే ఉంది పోతుంది ఎప్పటికీ..

First Published:  26 Oct 2023 5:52 AM GMT
Next Story