Telugu Global
WOMEN

పండగ వేళ మరింత అందంగా..

ఏదైనా పండగ రాబోతోందంటే చాలు అందంగా, కాంతి వంతంగా వెలిగిపోవాల‌ని మగువలు తెగ ఆరాట ప‌డుతుంటారు. పండ‌క్కి ప‌ది రోజుల ముందు నుంచే చ‌ర్మంపై ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.

పండగ వేళ మరింత అందంగా
X

పండగ వేళ మరింత అందంగా

ఏదైనా పండగ రాబోతోందంటే చాలు అందంగా, కాంతి వంతంగా వెలిగిపోవాల‌ని మగువలు తెగ ఆరాట ప‌డుతుంటారు. పండ‌క్కి ప‌ది రోజుల ముందు నుంచే చ‌ర్మంపై ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు. ఖ‌రీదైన ఫేస్ క్రీములు, మేకప్ కిట్స్ రెడీ చేసుకుంటారు. అయితే ఎంత మేకప్ వేసుకున్నా మన అందం పెంచుకోవాలి అంటే కొంత సౌందర్య పోషణ చేసుకోక తప్పదు. సో ఈ పండగరోజుల్లో మీ గ్లామర్ పెంచుకోవాలంటే ఇదిగో ఈ సింపుల్ పాక్స్ ట్రై చెయ్యండి.



1. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తగినంత రోజ్ వాటర్‌తో కలపండి. ముఖం మీద అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలానే ఉంచుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ ను గ్రహించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. నిమ్మ, తేనె ఫేస్ ప్యాక్ :ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ముఖం మీద పెట్టుకోవాలి. 15-20 నిమిషాలు వదిలివేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ ను తొలగించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. వేప, పసుపు ఫేస్ ప్యాక్ : ఒక పిడికెడు వేప ఆకులను గ్రైండ్ చేసి, అర టీస్పూన్ పసుపు పొడి, తగినంత నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయాలి. ముఖం మీద రాసుకుని 15-20 నిమిషాలు ఉంచండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరచడానికి, డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.

4. బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్ : బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి, 1 టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. ముఖం మీద అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాలు అలానే పెట్టుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.

5. సాండిల్, ఆల్మండ్ ఫేస్ ప్యాక్: చర్మం తెల్లగా నిగారింపు కోసం గంధం పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. గంధం పొడిని బాదంతో చేర్చి పొడి చేసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమంను పాలతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నునుపుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.

బయట కొన్న వాటికంటే ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా చేస్తాయి. అంటే కాదు చర్మ సంరక్షణకు ఇదొక సురక్షితమైన, సమర్థవంతమైన మార్గం కూడా.

First Published:  11 Oct 2023 9:45 AM GMT
Next Story