Telugu Global
Travel

సాహస యాత్ర కోసం కర్ణాటకలో యనా కేవ్స్

కర్ణాటకలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లలో యనా ఒకటి. ఇక్కడ అడుగుపెడితే చాలు ఒక పక్క జలపాతాలు, మరోపక్క వన్యప్రాణులు సాదరంగా స్వాగతం పలుకుతాయి.

సాహస యాత్ర కోసం కర్ణాటకలో యనా కేవ్స్
X

ఎప్పుడూ హాలిడే అంటే వినోదము, విహారమే కాదు ఒక్కోసారి సాహసం కూడా.. అందుకోసం మనదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యానా గుహలు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక భావన, సాహస యాత్రతో కూడిన ఈ పర్యాటక ప్రాంతం స్నేహితులతో వెళ్లడానికి ఒక మంచి ప్రదేశం.

కర్ణాటకలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లలో యనా ఒకటి. ఇక్కడ అడుగుపెడితే చాలు ఒక పక్క జలపాతాలు, మరోపక్క వన్యప్రాణులు సాదరంగా స్వాగతం పలుకుతాయి. ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి, ,కుమ్తా అడవుల్లో ఉన్న యనా విలేజ్..ప్రకృతి అందాలకే కాదు పరిశుభ్రతలో కూడా ఇది ది బెస్ట్ ప్లేస్. చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో రెండు భారీ గుహలు…ఈ ఒక్క మాట చాలు ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే అని నిర్ణయించుకోవడానికి.

ఉత్తర కన్నడ జిల్లాలోని కుంటా అనే ప్రాంతంలో ఉన్నాయి ఈ అందమైన నల్లరాతి గుహలు. రహదారికి కాస్త దూరంలో అడవిలో ఉండటంతో ఆ అడవిలో కాస్త దూరం ట్రెక్కింగ్ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. యనాలో ఉన్న రెండు ప్రత్యేకమైన రాతి గుహలలో భైరవేశ్వర శిఖరం ఎత్తు దాదాపు 390 అడుగులు కాగా, మోహిని శిఖరం ఎత్తు 300 అడుగులు.

సున్నపురాయి, జిప్సం, డోలమైట్ కలగలిపిన ఈ రెండు రాతి గుట్టలు ఎవరో చెక్కినట్లు టవర్స్‌లా ఉంటాయి.

భైరవేశ్వర శిఖర కింద ఆలయగుహ ఉంది. అక్కడే స్వయంభుగా వెలసిన శివలింగం పై నిత్యం నీళ్లు పడుతూనే ఉంటాయి. ఆ దృశ్యం చూసేందుకు, ఈ స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అయితే భక్తులకే కాదు, ట్రెక్కింగ్ చేసే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ట్రెక్కింగ్​ చేస్తూ కొండమీదకి చేరితే అక్కడి నుంచి కిందికి పారుతున్న జలపాతాల్ని చూడొచ్చు.

యానా గుహలకు సంబంధించి హిందూ పురాణాల్లోనూ ప్రస్తావించారని చెబుతారు. భస్మాసురుని వృత్తాంతం ఇక్కడే జరిగిందని, . భస్మాసురుడి బూడిద కారణంగా ఆ గుహలు నల్లరంగులా మారాయని అంటారు.


ఎలా వెళ్లాలంటే..

యనాకు వెళ్ళటానికి రోడ్, ట్రైన్​, ఫ్లైట్ మూడు మార్గాలు ఉన్నాయి. రోడ్​ అయితే సిర్సి నుంచి 50 కి.మీ., కుమ్తా నుంచైతే 30 కి.మీ ప్రయాణం చేయాలి. బెంగళూరు నుంచి అయితే లోకల్​ బస్‌ ఎక్కేయవచ్చు. ట్రైన్​లో అయితే హుబ్లీ రైల్వే స్టేషన్​ నుంచి కుమ్తా వెళ్లి అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్‌లో ఆ గ్రామానికి చేరుకోవచ్చు. మంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి 262 కిలోమీటర్లు, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్ నుంచైతే 463 కి.మీ. దూరం ఉంటుంది.

First Published:  16 Aug 2023 12:30 PM GMT
Next Story