Telugu Global
Travel

రెస్పాన్సిబుల్ టూరిజం గురించి తెలుసా?

పర్యాటకం పేరుతో పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండడమే రెస్పాన్సిబుల్ టూరిజం. అంటే బాధ్యతగా ప్రయాణాలు చేయడం అన్న మాట.

రెస్పాన్సిబుల్ టూరిజం గురించి తెలుసా?
X

ప్రకృతి అందాలను ఆస్వాదించడానికే చాలామంది టూర్లు వెళ్తుంటారు. అయితే పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకున్నంత వరకే ఏ టూర్ అయినా. ప్రకృతి పాడైపోయి, పర్యావరణం దెబ్బతింటే అప్పుడు ఆస్వాదించడానికి ఏమీ మిగలదు. కాబట్టి ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేస్తూనే, ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. దీన్నే ‘రెస్పాన్సిబుల్ టూరిజం’ అంటారు. ఇదెలా ఉంటుందంటే..

పర్యాటకం పేరుతో పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండడమే రెస్పాన్సిబుల్ టూరిజం. అంటే బాధ్యతగా ప్రయాణాలు చేయడం అన్న మాట. మరి దీన్నెలా అమలుచేయాలి. పర్యావరణం పాడవ్వకుండా ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నో ప్లాస్టిక్

ఎకో ఫ్రెండ్లీ ట్రావెలింగ్ చేయాలంటే.. ట్రావెలింగ్‌లో మనవెంట ప్లాస్టిక్ వస్తువులు లేదా ప్లాస్టిక్ కవర్లు లాంటివి తీసుకెళ్లడం మానేయాలి. అలాగే వెళ్లిన ప్రతీ చోటా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేయాలి. దానికి బదులు పేపర్, క్లాత్‌తో చేసిన కవర్లు వెంట తీసుకెళ్లడం మంచిది. ట్రావెల్ చేసిన ప్రతీసారి ఈ అలవాటును కంటిన్యూ చేస్తే.. ప్రకృతికి మరింత హెల్ప్ చేసిన వాళ్లమవుతాం.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్

ప్రయాణాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే వాడడం వల్ల ప్రకృతికి ఎంతో మేలు చేసినవాళ్లమవుతాం. క్యాబ్‌లు, ట్యాక్సీలతో పోల్చితే బస్సు, రైలు ప్రయాణాల్లో ఖర్చుకూడా తక్కువే. కార్లు, బైకుల వాడకం విపరీతంగా పెరగడం వల్లనే పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది. అందుకే ఒక రెస్పాన్సిబుల్ ట్రావెలర్‌‌గా ఉండాలంటే సొంత వాహనాలకు బదులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడాలి.

సొంత వస్తువులతో..

రెస్పాన్సిబుల్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్లు టూర్‌‌కి వెళ్లేటప్పుడు కావాల్సిన వస్తువులన్నింటినీ వెంట క్యారీ చేయాలి. లేకపోతే చిన్నచిన్న వాటికోసం షాపులపై ఆధార పడాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తే దాహం వేసినప్పుడల్లా దాన్ని నీటితో నింపుకోవచ్చు. లేకపోతే మంచినీళ్ల కోసం ప్రతీసారి ఒక ప్లాస్టిక్ బాటిల్ కొనాల్సి వస్తుంది. అంతేకాదు టూర్‌‌కి వెళ్లినప్పుడు బయట కొనే వస్తువులన్నీ దాదాపుగా సింగిల్ యూజ్ ప్లాస్టి్క్‌వే అయి ఉంటాయి. అవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే.

హోటల్స్‌ను ఇంటిలా..

టూర్‌‌లో స్టే చేసే ప్రతీ హోటల్‌ను సొంత ఇంటిలా భావించాలి. అక్కడ వాడే పేపర్లు, కవర్లు, నీళ్లు, కరెంట్.. ఇలా ప్రతీ ఒక్కటి ఇంట్లో వాడినట్టుగా జాగ్రత్తగా వాడాలి. బయటకు వెళ్తూ స్విచ్‌లు, వాటర్ ట్యాప్‌లు ఆపేసి బయటకి వెళ్లాలి. అలా చేసినప్పుడే అక్కడి పర్యావరణాన్ని కొంతవరకైనా కాపాడిన వాళ్లవుతారు.

ఇకవీటితోపాటు ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయకుండా ఉండడం,చెట్లకు, జంతువులకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం.

First Published:  29 May 2024 12:36 PM GMT
Next Story