Telugu Global
Travel

ఈ చెట్టు చూసేందుకు రిజర్వేషన్ కావాలి!

చైనాలోని ‘గూ గున్యిన్‌’ బౌద్ధాలయంలోని ఓ చెట్టు కూడా అలాగే ఆకులు రాల్చుతూ అందంగా కనిపిస్తుంది. ఇది ఎంత స్పెషల్ అంటే దీన్ని చూడ్డానికి ముందే రిజర్వేషన్ చేసుకోవాలి.

Gu guanyin Buddhist Temple Ginkgo Tree | ఈ చెట్టు చూసేందుకు రిజర్వేషన్ కావాలి!
X

Gu guanyin Buddhist Temple Ginkgo Tree | ఈ చెట్టు చూసేందుకు రిజర్వేషన్ కావాలి!

చలికాలం మొదలయ్యే ముందు వచ్చే సీజన్‌ని ఫాల్ లేదా ఆటమ్ అంటారు. ఈ కాలంలో కొన్ని చెట్ల ఆకులు, పువ్వులు రాలిపోయి, నేలంతా పూలపాన్పులా చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. చైనాలోని ‘గూ గున్యిన్‌’ బౌద్ధాలయంలోని ఓ చెట్టు కూడా అలాగే ఆకులు రాల్చుతూ అందంగా కనిపిస్తుంది. ఇది ఎంత స్పెషల్ అంటే దీన్ని చూడ్డానికి ముందే రిజర్వేషన్ చేసుకోవాలి.

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఉన్న ‘గూ గున్యిన్‌’ బౌద్ధాలయంలో ‘గింగ్‌కొ బిలోబా’ అనే చెట్టు ఉంది. ఈ చెట్టు సుమారు 1400 సంవత్సరాల కిందటిది. దీనికి ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టుగా పేరుంది. ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు చలికాలానికి ముందు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి.

ఎంతో అందమైన ఈ చెట్టును చూడడానికి విదేశాల నుంచి వేల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అయితే నవంబర్, డిసెంబర్ నెలలో టూరిస్టుల సంఖ్య ఇంకా భారీగా పెరుగుతుండడంతో ఆలయ నిర్వాహకులు రిజర్వేషన్ పద్ధతిని పెట్టారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లను మాత్రమే చెట్టును చూసేందుకు అనుమతిస్తారు. రిజర్వేషన్‌ చేసుకొని వచ్చినా.. నాలుగు గంటలు ‘క్యూ’లో నిలబడాలి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల మంది వరకూ ఈ చెట్టుని విజిట్ చేస్తారు.

First Published:  27 April 2023 7:25 AM GMT
Next Story