Telugu Global
Travel

వర్షాకాలంలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసులివే!

ప్రకృతి అందాలను చూడాలంటే మాన్‌సూన్‌ బెస్ట్‌ సీజన్‌. ఐలాండ్స్ నుంచి హిల్ స్టేషన్స్ వరకూ మాన్‌సూన్‌లో ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ముస్తాబవుతుంది.

Must visit places in monsoon
X

ప్రకృతి అందాలను చూడాలంటే మాన్‌సూన్‌ బెస్ట్‌ సీజన్‌. ఐలాండ్స్ నుంచి హిల్ స్టేషన్స్ వరకూ మాన్‌సూన్‌లో ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ముస్తాబవుతుంది. మీరు మాన్‌సూన్‌ సీజన్‌లో టూర్‌ ప్లాన్‌ చేస్తుంటే ఈ ప్లేసులను మాత్రం మిస్ అవ్వొద్దు.

కొండలను ముద్డాడే మేఘాలు, పొగమంచు కప్పుకున్న అడవులు, చల్లని నీటి తుంపరలను మోసుకొచ్చే వాటర్‌ ఫాల్స్‌... ఇటువంటి అనుభూతులను ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే దానికి ఈ సీజనే సరైన సమయం. ముఖ్యంగా ఇండియాలో బెస్ట్ మాన్‌సూన్ డెస్టినేషన్స్ ఏవంటే..

హావ్‌లాక్‌ ఐలాండ్‌

ఆసియాలో ఎక్కువ మంది విజిట్ చేసే బీచ్‌లలో హావ్‌లాక్‌ కూడా ఐలాండ్‌ ఒకటి. అండమాన్ దీవుల్లో ఉన్న ఈ ఐలాండ్ ప్రశాంతంగా, క్లియర్‌ వాటర్స్‌తో చూడగానే ఆహ్లాదంగా అనిపిస్తుంది. మాన్‌సూన్ సీజన్‌లో ఈ ఐలాండ్స్‌లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఇక్కడ ఫిషింగ్‌, స్కూబా డైవింగ్‌, కయాకింగ్‌, జంగిల్‌ ట్రెక్స్‌ వంటి యాక్టివిటీస్‌ కూడా చేయొచ్చు.

అగుంబె

కర్నాటకలో ఉన్న అగుంబె విలేజ్‌ను ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అని పిలుస్తుంటారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రదేశంలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ మాన్‌సూన్‌ సీజన్‌లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. కుంచికల్‌, బర్‌కానా వంటి వాటర్‌ఫాల్స్‌ ఇక్కడ కనువిందు చేస్తాయి.

కాస్‌ పఠార్

మహారాష్ట్రలోని సాతారాకు దగ్గర్లో ఉన్న కాస్ మైదానం పూలతో పరచిన కార్పెట్‌లా ఉంటుంది. ఇక్కడ 850 రకాల పూల వనాలు ఉంటాయి. ముఖ్యంగా మాన్‌సూన్‌లో ఈ ప్రాంతం భూలోక స్వర్గంగా మరింత అందంగా తయారవుతుంది. ఇక్కడికి దగ్గర్లో క్యాస్ లేక్, కోయనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంటాయి.

సుందర్బన్స్

బెంగాల్‌లో ఉన్న మడ అడవులను వీక్షించడానికి మాన్‌సూన్‌ సీజన్‌ బెస్ట్ ఆప్షన్. ఈ సీజన్‌లో పడవలపై రివర్ క్రూజ్ చేస్తూ అడవులను వీక్షించడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. వర్షాకాలం ఇక్కడి అడవులు పొగమంచుతో మరింత అందంగా కనువిందు చేస్తాయి.

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌

మాన్‌సూన్‌లో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఉత్తరాఖండ్‌లోని ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ కూడా ఒకటి. జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ లోయ ప్రాంతమంతా పూల వనంలా మారి సీతాకోకచిలుకలతో కనువిందు చేస్తుంది. సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో పది కిలోమీటర్ల మేర విస్తరించే ఉండే ఈ వ్యాలీ ఇండియాలోనే మోస్ట్ విజిటింగ్ ప్లేసుల్లో ఒకటి.

First Published:  10 Aug 2024 1:30 AM GMT
Next Story