Telugu Global
Travel

ముసోరీ సూర్యుడు

ముసోరీలో రోజు త్వరగా మొదలవుతుంది. సూర్యుడు మరీ పొద్దున్నే పొడిచాడా అనిపిస్తుంది.

Mussoorie Sunset Point
X

ముసోరీ సూర్యుడు

ముసోరీలో రోజు త్వరగా మొదలవుతుంది. సూర్యుడు మరీ పొద్దున్నే పొడిచాడా అనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు జామున ఆరుగంటలకు నిద్రలేచేటప్పటికి సూర్యుడు ఉదయించి ఉంటాడు, కానీ మబ్బు దుప్పట్లను తొలగించకుండా ఇంకా బద్దకంగానే కాంతులీనుతుంటాడు. ఉత్తరాఖండ్, ముసోరీలో మాత్రం ఆరు గంటలకు తెల్లగా మిరుమిట్లు గొలుపుతుంటాడు.



మన దగ్గర పదింటికి ఉన్నట్లు ఉంటుంది వెలుతురు. ఆరు గంటల సమయంలో కూడా సూర్యుడిని నేరుగా చూడడం సాధ్యం కానంత కాంతితో కళ్లు మిరుమిట్లుగొలుపుతూ ఉంటాడు. మనకు దగ్గరగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. మంచుకొండల మీద ప్రతిఫలించిన కాంతి కావడంతో ఆ తెల్లదనం. అంత కాంతిగా ఉంటాడు కానీ ఏ మాత్రం వేడిగా ఉండడు. చంద్రుడి వెన్నెలలా చల్లగా ఉంటాడు సూర్యుడు.



ముసోరీ పట్టణం ఒక దగ్గర ఉండదు. మొదటి ఇంటికి చివరి ఇంటికి మధ్య దూరం పాతిక కిలోమీటర్లు ఉంటుంది. కొండవాలులో ఉంటాయి ఇళ్లు. లైబ్రరీ రోడ్డులో ప్రయాణిస్తూ చూడాల్సిన చోట ఆగి కొంత సేపు చూసి ముందుకు పోవడం, వాహనం దిగి మాల్‌ రోడ్‌లో నడవడమే ఇక్కడ మెయిన్‌ టూర్‌. లైబ్రరీ రోడ్‌ చాలా రద్దీగా ఉంటుంది.



గ‘గన్‌హిల్‌’

గన్‌హిల్‌ మీద నుంచి మబ్బులను చూడాలంటే తల దించి చూడాలి. గన్‌హిల్‌ మీదకు వెళ్లడానికి కేబుల్‌ కార్, రోప్‌వే ఉంటుంది. ముసోరీ పట్టణం కొండవాలులో ఎలా విస్తరించి ఉందో తెలియలంటే రోప్‌వే మీదుగా రాత్రి పూట ప్రయాణించాలి. ఇళ్లలో వెలిగే లైట్లు దీపాల వరుసను పోలి ఉంటాయి.


ముసోరీలో నేల చదునుగా కనిపించేది ఈ కొండ మీదనే. ఇది ఫొటో షూట్‌ పాయింట్‌. ఇక్కడ కశ్మీరీ సంప్రదాయ దుస్తులు అద్దెకిస్తారు. ఈ కాస్ట్యూమ్‌ హౌస్‌లను నడిపేది ఫొటోగ్రాఫర్‌లే. ఎవరి స్టాల్‌లో దుస్తులు, నగలు అద్దెకు తీసుకుంటే వాళ్లే ఫొటో తీస్తారు. పది నిమిషాల్లో ప్రింట్‌ ఇస్తారు. ఈ గగన్‌హిల్‌ నుంచి చూస్తే మబ్బులు లేకుండా ఆకాశం క్లియర్‌గా ఉన్నప్పుడు హిమాలయాలు కనిపిస్తాయని చెబుతారు.



First Published:  20 Jan 2023 7:13 AM GMT
Next Story