Telugu Global
Travel

ఎముకల రోడ్డు గురించి తెలుసా?

ఎక్కడైనా రోడ్డు తవ్వితే మట్టి లేదా కంకర వస్తుంది. కానీ, రష్యాలోనీ ఓ రోడ్డు తవ్వితే ఎముకలు బయటకొస్తాయి. ఎందుకంటే ఆ రోడ్డు కింద కొన్ని లక్షల మృతదేహాలున్నాయి కాబట్టి. ‘ఎముకల రోడ్డు (రోడ్ ఆఫ్ బోన్స్)’గా పిలిచే ఈ రోడ్డుకి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

ఎముకల రోడ్డు గురించి తెలుసా?
X

ఎముకల రోడ్డు గురించి తెలుసా?

ఎక్కడైనా రోడ్డు తవ్వితే మట్టి లేదా కంకర వస్తుంది. కానీ, రష్యాలోనీ ఓ రోడ్డు తవ్వితే ఎముకలు బయటకొస్తాయి. ఎందుకంటే ఆ రోడ్డు కింద కొన్ని లక్షల మృతదేహాలున్నాయి కాబట్టి. ‘ఎముకల రోడ్డు (రోడ్ ఆఫ్ బోన్స్)’గా పిలిచే ఈ రోడ్డుకి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలోని కొలిమా అనే ప్రాంతంలో విలువైన ఖనిజాలు దొరికేవి. కానీ, అక్కడ ఉండే బంగారు గనులు, ఖనిజాలను వెలికి తీయడానికి ఎలాంటి రోడ్డు మార్గం లేదు. అందుకే అప్పట్లో వాటిని రష్యన్ నగరమైన ‘కబరోస్క్‌’కు తీసుకొచ్చేందుకు సముద్ర మార్గాన్ని వాడుకునేవాళ్లు. ఓడల్లో రవాణా లేట్ అవుతుండడంతో అప్పటి రష్యా అధినేత స్టాలిన్ అక్కడికి ఒక రోడ్డు వేయించాలనుకున్నాడు. రోడ్డు కట్టడానికి రష్యాలోని జైళ్లలో ఉన్న ఖైదీలను పురమాయించమని అధికారులను ఆదేశించాడు. అయితే, ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మించడం అంత ఈజీ కాదు. అక్కడుండే మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతకు ఖైదీల ప్రాణాలు పోయేవి. ఆ ప్రాంతంలో వేసవికాలం వచ్చిందంటే అడవి దోమలు రక్తం పీల్చేవి. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తూ రోజుకు కనీసం పాతికమంది ఖైదీలు మరణించేవారట. అయితే వాళ్లని వెనక్కి తీసుకెళ్లి, అంతిమ సంస్కారాలు జరిపించకుండా చనిపోయిన చోటే గుంత తవ్వి, అందులో పాతిపెట్టేసి వాటిపై రోడ్డు వేసేవాళ్లు. అలా రోడ్డు పొడవునా మృతదేహాలు పాతిపెట్టినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.

రెండువేల కిలోమీటర్ల పొడవున్న ‘పీ–504’ రోడ్డుని నిర్మించడానికి దాదాపు 20 ఏండ్లు పట్టింది. ఈ రోడ్డు సుమారు రెండున్నర లక్షల మందిని బలితీసుకుంది. రష్యాలో ఇప్పటికీ ఈ రోడ్డు జాతీయ రహదారిగా ప్రయాణికులకు అందుబాటులో ఉంది. అయితే ఈ రోడ్డపై ప్రయాణించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ రోడ్డు వింటర్‌‌లో మంచుతో కప్పబడి ఉంటుంది. దారిపొడవునా ఎలుగుబంట్లు దాడి చేసే అవకాశాలున్నాయి. అయినా కొంతమంది అడ్వెంచర్ టూరిస్టులు అప్పుడప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణాలు చేస్తుంటారు.

First Published:  9 Sep 2023 2:30 AM GMT
Next Story