Telugu Global
Travel

టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేముందు ఇవి తెలుసుకోండి!

టూర్ వెళ్లేందుకు చాలామంది ట్రావెల్ ప్యాకేజీలను ఎంచుకుంటుంటారు. జర్నీ టికెట్స్‌తో పాటు కావాల్సిన వసతులన్నీ ఒకే ప్యాకేజీలో అందించేలా ఆన్‌లైన్‌లో రకరకాల ట్రావెల్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.

టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేముందు ఇవి తెలుసుకోండి!
X

టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేముందు ఇవి తెలుసుకోండి!

టూర్ వెళ్లేందుకు చాలామంది ట్రావెల్ ప్యాకేజీలను ఎంచుకుంటుంటారు. జర్నీ టికెట్స్‌తో పాటు కావాల్సిన వసతులన్నీ ఒకే ప్యాకేజీలో అందించేలా ఆన్‌లైన్‌లో రకరకాల ట్రావెల్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి బుకింగ్స్ చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

వింటర్ వెకేషన్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఫ్రాడ్ ట్రావెల్ ఏజెన్సీలు మెసేజెస్ , మెయిల్స్ పంపిస్తూ ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో ట్రిప్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తుంటాయి. దాంతో చాలామంది ఏజెన్సీల మీద ఆసక్తి చూపుతుంటారు చాలామంది. కానీ ఆ మాయలో కొన్ని విషయాలు పట్టించుకోవడం మర్చిపోతారు. ఫుల్ ప్యాకేజ్ అనగానే అందులో అన్నీ ఉంటాయనుకుంటారు. కానీ ఇలాంటి వాటిల్లో చాలావరకు ఫ్లైట్ లేదా ట్రైన్ టికెట్లు, హోటల్, రిటర్న్ పికప్‌ మాత్రమే అందజేస్తాయి. భోజన వసతి, లోకల్ సైట్ సీయింగ్, సందర్శన స్థలాల్లో ఎంట్రీ టికెట్లు లాంటివి ప్యాకేజీలో అందించరు. అందుకనే బుక్ చేసుకునే ముందు ఇవన్నీ ప్యాకేజీలో ఉన్నాయో లేదో తెలుసుకొని బుక్‌ చేసుకోవడం మంచిది. అంతే కాకుండా బుకింగ్‌కు ముందే ప్రయాణ ప్రణాళిక గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏయే ప్రదేశాలు చూపిస్తారు, ఒక్కో ప్రాంతానికి ఎంత సమయం కేటాయిస్తారు, ఏ స్థాయి హోటల్‌లో బస ఉంటుంది.. తదితర వివరాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని బుక్‌ చేసుకోవాలి.

నమ్మకమైనదైతేనే..

ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించే ముందు ఆ ఏజెన్సీ వెబ్‌సైట్‌ను పూర్తిగా పరిశీలించి, అది నమ్మకమైనదో కాదో తెలుసుకోవాలి. ఆ సంస్థ పూర్వానుభవం ఏమిటో తెలుసుకోవాలి. సంస్థ బ్యాక్‌గ్రౌండ్ బాగుందనిపిస్తే ప్రయాణ బాధ్యతలు వారికి అప్పగించాలి. రవాణా, సైట్‌ సీయింగ్‌, ఎంట్రీ ఫీజులు, భోజనం, బస అన్నీ ఉన్నాయో లేదో అడిగి మరీ తెలుసుకోవాలి. బుకింగ్‌కు ముందే.. సంస్థ ప్రతినిధిని కలవడం ద్వారా.. విహారంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా.. ట్రావెల్‌ ఆపరేటర్‌ను నేరుగా సంప్రదించవవచ్చా? సంస్థ ప్రతినిధి అందుబాటులో ఉంటాడా? అనేవి నిర్ధారించుకోవచ్చు. అంతా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుని తీరా అక్కడికి వెళ్లాక తక్షణ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో అర్థం కాకపోవచ్చు.

బుక్ చేసేముందు ప్యాకేజీలో ఉన్న వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఎంచుకున్న బస్సు లేదా ఫ్లైట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది. అక్కడి నుంచి ఎలా వెళ్లాలి లాంటి అంశాలు ముందే తెలుసుకోవాలి. టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పగానే సంబంధిత ఎయిర్ లైన్, ట్రైన్ , హోటల్‌ను సంప్రదించి నిర్ధారించుకోవడం మంచిది. ట్రాన్స్‌పోర్ట్ విషయానికొస్తే ఏజెన్సీని ఎంచుకునే ముందు దానికి ఐఏటిఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్) అప్రూవల్ లోగో ఉందో లేదో చూసుకోవాలి

ప్యాకేజి వివరాల్లో చివరన ఉండే కండిషన్స్ అప్ప్లై పూర్తిగా తెలుసుకోవాలి. ఇన్‌క్లూజన్స్‌ (ప్యాకేజీలో ఉన్నవి), ఎక్స్‌క్లూజన్స్‌ (లేనివి) గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. ప్రతి దాంట్లో పరిమితులు ఉంటాయని తెలుసుకోవాలి. పేమెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త గా వ్యవహరించాలి. ఆన్‌లైన్‌లో చెల్లించే ముందు పేమెంట్ గేట్ వే నమ్మకమైనదా కాదా అనేది చూసుకోవాలి. ట్యాక్స్ ఎంత పడుతుందనే వివరాలు కూడా సరిచూసుకోవాలి.

ప్రభుత్వ ప్యాకేజీలు

ఆన్‌లైన్‌ పర్యాటక సంస్థల మాదిరిగానే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, టూరిజం శాఖలు కూడా కోరుకున్న బడ్జెట్‌లో ప్యాకేజీలను కల్పిస్తాయి. నిర్వహించేది ప్రభుత్వం కాబట్టి ట్రావెలింగ్, వసతి, హోటల్స్ ఇలా అన్నింటిలో నమ్మకం ఉంటుంది. దీని ద్వారా ఫ్రాడ్‌ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

First Published:  9 Nov 2023 10:45 AM GMT
Next Story