Telugu Global
Travel

కార్ పూలింగ్ గురించి తెలుసా?

సిటీలో తిరగాలన్నా, వేరే ఊరికి వెళ్లాలన్నా బస్సు లేదా ఇతర ఆప్షన్లు మాత్రమే తెలుసు చాలామందికి. అయితే కార్ పూలింగ్ అనే ఓ కొత్త కాన్సెప్ట్ ఇటీవల పాపులర్ అవుతోంది. సొంత కారులో వెళ్లేవాళ్లు తమ రైడ్‌ను ఇతరులతో షేర్ చేసుకునే ఆప్షన్ ఇది.

కార్ పూలింగ్ గురించి తెలుసా?
X

కార్ పూలింగ్ గురించి తెలుసా?

సిటీలో తిరగాలన్నా, వేరే ఊరికి వెళ్లాలన్నా బస్సు లేదా ఇతర ఆప్షన్లు మాత్రమే తెలుసు చాలామందికి. అయితే కార్ పూలింగ్ అనే ఓ కొత్త కాన్సెప్ట్ ఇటీవల పాపులర్ అవుతోంది. సొంత కారులో వెళ్లేవాళ్లు తమ రైడ్‌ను ఇతరులతో షేర్ చేసుకునే ఆప్షన్ ఇది. ఇదెలా ఉంటుందంటే..

సొంత కార్లు ఉన్నవాళ్లు చాలాసార్లు కారులో సింగిల్‌గా ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అదే రూట్‌లో వెళ్లే వాళ్లతో జర్నీ షేర్ చేసుకోవడం ద్వారా కారులో బోర్ కొట్టకుండా ఉంటుంది, పెట్రోల్ ఖర్చూ కలిసొస్తుంది, ఈ కాన్సెప్ట్‌తో మొదలైందే కార్ పూలింగ్.

రోజూ కారులో ఆఫీస్‌కి వెళ్లేవాళ్లు, పనుల మీద వేరే ఊరికి వెళ్తున్నవాళ్లు కార్ పూలింగ్ ఆప్షన్ ద్వారా ఇతరులను కారులో ఎక్కించుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు బస్, ట్రైన్ ఆప్షన్లతో పాటు కార్ పూలింగ్ ఆప్షన్ కూడా ఓసారి ట్రై చేయొచ్చు. కార్ పూలింగ్ వంటి జర్నీ షేరింగ్ ఆప్షన్స్‌ను అందించేందుకు బోలెడు ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. కారులో మనతో పాటు అదే రూట్లో ప్రయాణించే వారికోసం వెతుక్కోవాల్సిన అసరం లేకుండా ఈ యాప్స్ లేదా వెబ్‌సైట్స్ సాయపడతాయి. యాప్స్ లేదా వెబ్‌సైట్స్‌లో లాగిన్ అయ్యి, ప్రయాణించే రూటు, కారు నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే.. సేమ్ రూట్లో ప్రయాణించే వ్యక్తులతో కనెక్ట్ అవ్వొచ్చు. ఇద్దరు కలిసి కార్‌‌రైడ్‌ని షేర్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో రైడ్‌మేట్స్, క్విక్ రైడ్, యస్ రైడ్, బ్లాబ్లా కార్, జిఫీ లాంటి యాప్‌లు.. కార్ పూలింగ్ సేవలను అందిస్తున్నాయి.

కార్‌ పూలింగ్‌తో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోల్ ఖర్చులు తగ్గడం ఒక లాభమైతే.. కొత్త స్నేహాలు ఏర్పడడం మరో లాభం. అప్పటి వరకు ఒకే ఏరియాలో ఒకే కాలనీలో ఉంటున్నా లేదా ఒకే కంపెనీలో పనిచేస్తున్నా ఏ మాత్రం పరిచయం లేకుండా ఎవరికి వారే రాకపోకలు సాగించేవాళ్లంతా కార్‌పూలింగ్‌ వల్ల ఫ్రెండ్స్ అవ్వొచ్చు. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాల కోసమే చాలామంది కార్ పూలింగ్‌ను ఇష్టపడుతుంటారు. మాములుగా క్యాబ్, ఆటో ద్వారా ప్రయాణించడం కన్నా ఇది ఎన్నోరెట్లు సేఫ్‌గా ఫీలవుతున్నారు. విమెన్ ఎంప్లాయిస్‌కు కూడా కార్ పూలింగ్ నమ్మకంగా తోస్తుంది. మామూలు క్యాబ్‌తో పోలిస్తే కార్ పూలింగ్ ఛార్జీ తక్కువగానే ఉంటుంది. కారు ఓనర్ డిసైడ్ చేసిన రేటుతో పాటు యాప్‌కు కొంత షేర్ ఉంటుంది.

రోడ్డుపై వాహనాల సంఖ్య పెరగడం పొల్యూషన్‌కి ఒక కారణం. కార్ పూలింగ్ ద్వారా ఆ సమస్యను కూడా తగ్గించినవారవుతారు. ఒక్కరి కోసం కారు వాడితే రోడ్డుమీదే అన్నీ కార్లే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ వల్ల కనీసం కొన్ని వెహికల్స్‌ అయినా తగ్గించొచ్చు. ఇలా కార్ పూలింగ్ చేయడం ద్వారా పర్యావరణానికి కూడా మేలుచేసిన వారవుతారు.

First Published:  25 Oct 2023 9:53 AM GMT
Next Story