Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ సౌత్ ఇండియా టూర్! ప్యాకేజీ వివరాలివే..

సౌత్ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్రను ఆపరేట్ చేస్తుంది.

ఐఆర్‌‌సీటీసీ సౌత్ ఇండియా టూర్! ప్యాకేజీ వివరాలివే..
X

సౌత్ ఇండియాలోని ప్రముఖమైన ప్రదేశాలను కవర్ చేస్తూ.. ఐఆర్ సీటీసీ ఓ ప్రత్యేకమైన టూర్ ఆపరేట్ చేస్తోంది. సమ్మర్ సెలవుల్లో సౌత్ ఇండియాలోని పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేసులను చూసి రావాలనుకునేవారికి ఈ టూర్ బెస్ట్ ఛాయిస్.

సౌత్ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్రను ఆపరేట్ చేస్తుంది. 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్.. హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ఈ టూర్‌‌లో భాగంగా అరుణాచలం , రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచి, తంజావూర్ ప్రాంతాలు కవర్ చేయొచ్చు. టూర్ ఎలా సాగుతుందంటే..

మే 25న హైదరాబాద్ లో రైలు ఎక్కడంతో టూర్ మొదలవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోల్, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో కూడా రైలు ఎక్కొచ్చు. మొదటిరోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తిరువన్నామలై చేరుకుంటారు. అక్కడ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుని రామేశ్వరం బయల్దేరతారు. మూడో రోజు రామేశ్వరం చేరుకుని అక్కడి ఆలయాలను కవర్ చేస్తారు. రాత్రికి రామేశ్వరంలో బస చేసి.. నాలుగో రోజు రామేశ్వరం నుంచి మధురై బయల్దేరతారు. అక్కడ మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుని రాత్రికి కన్యాకుమారి బయల్దేరతారు. ఐదో రోజు కన్యాకుమారి చేరుకుని.. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ వంటివి చూసి.. రాత్రికి హోటల్లో స్టే చేస్తారు.

ఇక ఆరో రోజు కన్యాకుమారి నుంచి తిరువనంతపురం (త్రివేండ్రం) బయల్దేరతారు. అక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్ వంటివి చూసుకుని.. తిరుచి బయల్దేరతారు. ఏడో రోజు తిరుచిలోని శ్రీరంగం ఆలయం, బృహదీశ్వరాలయం చూసుకుని.. రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణం, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, సైట్ సీయింగ్, ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరలు ఎకానమీ క్లాస్‌కు రూ.14,250, స్టాండర్డ్ క్లాస్‌కు రూ.21,900, కంఫర్ట్ క్లాస్‌కు రూ.28,450 గా ఉన్నాయి. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్( irctctourism.com) విజిట్ చేయొచ్చు.

First Published:  21 May 2024 12:33 PM GMT
Next Story