Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ కాశీ టు రామేశ్వరం టూర్.. ప్యాకేజీ వివరాలివే..

దీపావళి సందర్భంగా కాశీ నుంచి రామేశ్వరం వరకు ఒకే ట్రిప్‌లో తీసుకువెళ్లేందుకు ఐఆర్‌సీటిసి స‌రికోత్త ప్యాకేజీని అందుబాటులోఉంచింది. కేవలం రూ. 17,000 కే వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, గయ, రామేశ్వరానికి టూర్ వేయొచ్చు. ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే.

ఐఆర్‌‌సీటీసీ కాశీ టు రామేశ్వరం టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ కాశీ టు రామేశ్వరం టూర్.. ప్యాకేజీ వివరాలివే..

దీపావళి సందర్భంగా కాశీ నుంచి రామేశ్వరం వరకు ఒకే ట్రిప్‌లో తీసుకువెళ్లేందుకు ఐఆర్‌సీటిసి స‌రికోత్త ప్యాకేజీని అందుబాటులోఉంచింది. కేవలం రూ. 17,000 కే వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, గయ, రామేశ్వరానికి టూర్ వేయొచ్చు. ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

దీపావళి పండుగ సందర్భంగా ఐఆర్‌‌సీటీసీ.. ‘దివాళి గంగా స్నాన యాత్ర’ పేరుతో ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లతో కూడిన లాంగ్ టూర్‌‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ ట్రిప్‌లో భాగంగా త్రివేణి సంగమం, విశ్వనాథ ఆలయం, బోధ్ గయా, రామేశ్వరం టెంపుల్ వంటివి కవర్ చేయొచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు ఈ టూర్‌‌లో జాయిన్ అవ్వొచ్చు. టెంకాసి నుండి బయల్దేరే భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ఈ నెల 9న ప్రారంభమవుతుంది.

మొదటిరోజు తమిళనాడులోని టెంకాసి నుంచి బయల్దేరే రైలు రాజపాళయం, శివకాశి, విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, చెన్నై, గూడూరు, విజయవాడ, వరంగల్, జబల్‌పూర్ మీదుగా మూడోరోజుకి ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. ఆరోజు త్రివేణి సంగమం చూసుకుని వారణాసికి బయల్దేరతారు. మూడోరోజు రాత్రి వారణాసిలో స్టే ఉంటుంది.

నాలుగోరోజు కాశీ విశ్వనాధ ఆలయం, విశాలాక్షి టెంపుల్ , సారనాధ్ ఆలయం చూసుకుని రాత్రికి వారణాసిలోని హోటల్‌లో స్టే చేస్తారు. ఐదోరోజు వారణాసి నుంచి బయల్దేరి గయకు చేరుకుంటారు. ఐదోరోజు నైట్ స్టే గయలో ఉంటుంది. ఇక ఆరో రోజు గయ చూసుకుని రామేశ్వరం బయల్దేరతారు.

రెండు రోజుల ప్రయాణం తర్వాత ఎనిమిదోరోజుకి మండపం చేరుకుంటారు. అక్కడ్నుంచి వెహికల్‌లో రామేశ్వరం వెళ్తారు. ఎనిమిదోరోజు రాత్రి రామేశ్వరంలో స్టే చేస్తారు. ఇక తొమ్మిదో రోజు రామేశ్వరం టెంపుల్ చూసుకుని రాత్రికి తిరుగు ప్రయాణం అవ్వడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో భాగంగా ట్రైన్ జర్నీ, హోటల్ స్టే, తొమ్మిది రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,డిన్నర్, ఎంట్రీ టికెట్లు, ట్రావెల్ గైడ్‌ వంటివి కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరలు ఎకానమీలో సింగిల్, డబుల్, ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,850, కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్, డబుల్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 30,500 గా ఉన్నాయి.

First Published:  1 Nov 2023 7:45 AM GMT
Next Story