Telugu Global
Travel

వేసవిలో ప్రయాణాలకు ఇలా రెడీ అవ్వండి!

సమ్మర్‌ హాలిడేస్ కు చాలామంది ఫ్యామిలీతో కలిసి టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఎండల్లో ప్రయాణాలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

వేసవిలో ప్రయాణాలకు ఇలా రెడీ అవ్వండి!
X

వేసవిలో ప్రయాణాలకు ఇలా రెడీ అవ్వండి!

సమ్మర్‌ హాలిడేస్ కు చాలామంది ఫ్యామిలీతో కలిసి టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఎండల్లో ప్రయాణాలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే..

సమ్మర్‌‌లో ప్రయాణాలు చేసేటప్పుడు దాహం వేయక పోయినా తరచూ నీటిని తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడొచ్చు. సమ్మర్ టూర్‌లో మర్చిపోకుండా రెండు, మూడు వాటర్ బాటిళ్లు వెంట తీసుకెళ్లాలి.

వేసవి ప్రయాణాల్లో వదులైన కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది. చిన్నపిల్లల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు లేత రంగులో ఉండే పలుచని బట్టలు వేస్తే మంచిది.

సమ్మర్‌లో ట్రావెల్ చేసేటప్పుడు పండ్ల రసాలు, ఓఆర్‌‌ఎస్ వంటివి వెంట తీసుకువెళ్లడం మంచిది. ఎండాకాలంలో శరీరంలో ఉప్పుశాతం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తీసుకునే ఆహారాల్లో ఉప్పు ఉండేలా చూసుకోవాలి.

పిల్లలు, పెద్ద వాళ్లతో కలిసి ఫ్యామిలీ టూర్స్‌కు వెళ్లేటప్పుడు రోజువారీ మందులు, ఒక మెడికల్ కిట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

ఇకపోతే టూర్‌కు వెళ్ళే ప్లేస్‌లో వాతావరణం, అక్కడి వసతుల గురించి ముందే తెలుసుకుని వెళ్లడం మంచిది. ఎండలు ఎక్కువగా ఉండే సమయాల్లో బయట తిరగకుండా ఉండేలా చూసుకోవాలి.

First Published:  30 May 2023 10:52 AM GMT
Next Story