Telugu Global
Travel

ద్వాదశ జ్యోతిర్లింగాలు

ఈ పవిత్రభారతావనిలో పన్నెండు చోట్ల, జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
X

ద్వాదశ జ్యోతిర్లింగాలు

జ్యోతి స్వరూపుడైన మహేశుడు,

ఈ పవిత్రభారతావనిలో పన్నెండు చోట్ల, జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

భారతదేశంలోని

నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి.

సముద్రపు ఒడ్డున రెండు :

————————————

బంగాళాఖాత తీరంలో

రామేశ్వర లింగం,

అరేబియా సముద్రతీరాన

సోమనాథ లింగం.

పర్వతశిఖరాలలో నాలుగు :

————————————-

శ్రీశైలంలో

మల్లికార్జునుడు,

హిమాలయాలలో

కేదారేశ్వరుడు,

సహ్యాద్రి పర్వతాలలో

భీమశంకరుడు,

మేరుపర్వతాలపై

Advertisement

వైద్యనాథ లింగం.

మైదాన ప్రదేశాలలో మూడు

______

దారుకా వనంలో

నాగేశ్వర లింగం,

ఔరంగాబాద్వద్ద

ఘృష్టేశ్వర లింగం,

ఉజ్జయినీ నగరంలో

మహాకాళేశ్వర లింగం,

నదుల ఒడ్డున మూడు :

_____

గోదావరీ తీరాన

త్ర్యంబకేశ్వర లింగం,

నర్మదా తీరాన

ఓంకారేశ్వరుడు,

గంగానదీ తీరాన

విశ్వేశ్వరుడు.

ఇలా, మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలో నున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు.

ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు.

పదమూడవ లింగం కాల లింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాల లింగము.

Advertisement

తైత్తీరీయో పనిషత్తును అనుసరించి,

1. బ్రహ్మ

2. మాయ

3. జీవుడు

4. మనస్సు

5. బుద్ధి

6. చిత్తము

7. అహంకారము

8. పృథ్వి

9. జలము

10.తేజస్సు

11. వాయువు

12. ఆకాశం

ఈ పన్నెండు తత్త్వాలే, పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి.

ఖాట్మండులోని, పశుపతినాథ లింగం ఈపన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలొ, ఒక్కొక్క జ్యోతిర్లింగానికి, ఒక్కొక్క మహిమఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా, అనేక మహిమలు మన జీవితాలలొ ప్రస్ఫుట మవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంత కోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.

- శివనాగ్

Next Story