Telugu Global
Travel

జనవరిలో వెళ్లాల్సిన టూర్స్ ఇవే..

జనవరి నెల ప్రయాణాలకు అనువైన కాలం. ఈ నెలలో ఉండే మంచు, చలి కారణంగా కొన్ని ప్రాంతాలు మరింత అందంగా ముస్తాబవుతాయి. ఈ నెలలో వెళ్లదగిన బెస్ట్ ప్లేసులు ఏవంటే.

జనవరిలో వెళ్లాల్సిన టూర్స్ ఇవే..
X

మరికొన్ని రోజుల్లో సంక్రాంతి హాలిడేస్ రానున్నాయి. ఈ సెలవల్లో చాలామంది టూర్స్ వెళ్తుంటారు. మరి ఈ నెలలో ప్రయాణాలు చేసేందుకు ఎలాంటి ప్రాంతాలు అనువైనవో తెలుసుకుందామా!

జనవరి నెల ప్రయాణాలకు అనువైన కాలం. ఈ నెలలో ఉండే మంచు, చలి కారణంగా కొన్ని ప్రాంతాలు మరింత అందంగా ముస్తాబవుతాయి. ఈ నెలలో వెళ్లదగిన బెస్ట్ ప్లేసులు ఏవంటే..

రాజస్థాన్

రాజస్థాన్ నెల ఈ నెలలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఎండలు తక్కువగా ఉండడమే కాకుండా ఉదయం, సాయంత్రాలు పొగమంచుతో ఎడారి ప్రాంతం మరింత ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎడారితో పాటుగా జైపూర్, ఉదయ్ పూర్ వంటి ప్రాంతాల్లో ఉండే కోటలను సందర్శించడానికి కూడా ఇదే అనువైన సమయం.

ఆగ్రా

తాజ్ మహల్ అందాలను చూసేందుకు జనవరి నెల బాగుంటుంది. ఈ టైంలో పొగమంచుతో కూడిన తాజ్ మహల్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ టైంలో ఇక్కడకు టూరిస్టుల తాకిడి కూడా తక్కువే. కాబట్టి ఆగ్రా టూర్ వెళ్లాలనుకునేవాళ్లు ఈ నెలలో ట్రిప్ ప్లాన్ చేసుకొవచ్చు.

అండమాన్ దీవులు

అందమైన అండమాన్ దీవులను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇదే అనువైన సమయం. ఈ నెలలో ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. స్క్యూబా డైవింగ్, స్నోర్ కెల్లింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్‌కు, కోరల్ రీఫ్స్ చూడ్డానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు.

మున్నార్

కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ ఈ నెలలో మరింత అందంగా ముస్తాబవుతుంది. మంచులో కాఫీ తోటల మీదుగా ఎత్తైన కొండల్లో చేసే ప్రయాణం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా హనీమూన్‌కు ఇది బెస్ట్ ప్లేస్.

గోవా

గోవాలో ఈ నెల టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో ఇక్కడ కొద్దిపాటి చలి, కొద్దిపాటి ఎండగా అనిపిస్తుంది. సన్ బాతింగ్‌కు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటి వాటికి ఈ టైంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది.

హంపి

చలికాలంలో కాస్త ఎండను అనుభూతి చెందాలంటే జనవరిలో హంపికి వెళ్లొచ్చు. ఇక్కడుండే రాతి కొండల వల్ల ఇక్కడ వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో చలితో పాటు ఎండ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో హంపికి ఫారెన్ టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తుంటారు.

First Published:  9 Jan 2024 9:59 AM GMT
Next Story