Telugu Global
Travel

తక్కువ టైంలో వెళ్లదగిన ఫారిన్ టూర్లు ఇవే!

మూడు నాలుగు రోజుల్లో మంచి ఫారిన్ టూర్ వేయాలనుకునే వారికోసం ప్రస్తుతం చాలానే ఆప్షన్లు ఉన్నాయి.

తక్కువ టైంలో వెళ్లదగిన ఫారిన్ టూర్లు ఇవే!
X

ఫారిన్ కంట్రీస్‌కు టూర్స్‌ వెళ్లే ట్రెండ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. పైగా విదేశాలకు వెళ్లడానికి పెద్దగా సమయం కూడా పట్టట్లేదు. కేవలం నాలుగైదు గంటల్లో చేరుకోగలిగే ఫారిన్ ట్రిప్స్ చాలానే ఉన్నాయి.

మూడు నాలుగు రోజుల్లో మంచి ఫారిన్ టూర్ వేయాలనుకునే వారికోసం ప్రస్తుతం చాలానే ఆప్షన్లు ఉన్నాయి. దేశంలోని పలు ఎయిర్ పోర్ట్స్ నుంచి నాలుగు గంటల వ్యవధిలో చేరుకోగల కొన్ని బెస్ట్ ఫారిన్ డెస్టినేషన్స్ ఇప్పుడు చూద్దాం.

భూటాన్

హ్యాపియెస్ట్ కంట్రీగా పేరొందిన భూటాన్ దేశం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సిక్కిం రాష్ట్రానికి ఆనుకుని ఉండే ఈ దేశం పూర్తిగా హిమాలయాలతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ హిమాలయన్ విలేజెస్‌తో పాటు బోలెడు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఢిల్లీ లేదా కోల్‌కతా నుంచి భూటాన్‌కు ఫ్లైట్‌లో రెండు గంటల్లో చేరుకోవచ్చు.

దుబాయ్

తక్కువ టైంలో మంచి లగ్జరీ ఫారిన్ ట్రిప్ వేయాలనుకునేవాళ్లు దుబాయ్‌పై ఓ లుక్కేయొచ్చు. ఇక్కడ ఆర్టిఫీషియల్ ఐల్యాండ్స్, అందమైన బీచ్‌లు, ఆకాశన్నంటే బిల్డింగులు, షాపింగ్ సెంటర్లు.. ఇలా దుబాయ్‌లో చేయదగిన యాక్టివిటీస్ బోలెడు ఉన్నాయి. ఫ్లైట్‌లో ముంబయి నుంచి దుబాయ్‌కు కేవలం నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.

వియత్నాం

అడవులతో కూడిన ఐలాండ్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేసేందుకు వియత్నాం మంచి ప్లేస్. ముంబయి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి నాలుగు గంటలు పడుతుంది. ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఇక్కడి కరెన్సీ చాలా తక్కువ. బడ్జెట్‌లో మంచి ఫారిన్ టూర్ వేయాలంటే ఇదే సరైన ఆప్షన్.

సింగపూర్

ప్రపంచంలోనే అత్యంత విలాసమైన దేశాల్లో సింగపూర్ ఒకటి. ఇక్కడికి కేవలం నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. భిన్నమైన కట్టడాలతో పాటు పలు అడ్వెంచర్ యాక్టివిటీస్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే సింగపూర్ బెస్ట్‌ ఆప్షన్.

ఒమన్

ఇండియా నుంచి అరబ్ దేశాలకు చేరుకోడానికి కూడా కేవలం నాలుగైదు గంటల సమయమే పడుతుంది. అందమైన బీచ్‌లతో పాటు ఎడారులు, సుల్తాన్‌ల కట్టడాలు, మ్యూజియాల వంటివి ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఒమన్ బెస్ట్ ప్లేస్.

First Published:  13 Aug 2024 11:48 AM GMT
Next Story