Telugu Global
Travel

వచ్చే ఏడాదికి ఈ కొత్త ప్లేసులు రెడీ!

కొత్త సంవత్సరంలో కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేయాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం వచ్చే ఏడాది కొన్ని కొత్త టూరిస్ట్ స్పాట్‌లు రెడీ అవుతున్నాయి.

వచ్చే ఏడాదికి ఈ కొత్త ప్లేసులు రెడీ!
X

వచ్చే ఏడాదికి ఈ కొత్త ప్లేసులు రెడీ!

కొత్త సంవత్సరంలో కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేయాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసం వచ్చే ఏడాది కొన్ని కొత్త టూరిస్ట్ స్పాట్‌లు రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వచ్చే ఏడాది మార్చి నాటికి రామేశ్వరంలో కొత్త పంబన్ బ్రిడ్జి రెడీ అవుతుంది. సముద్రంపై కొత్తగా నిర్మిస్తున్న పంబన్ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వచ్చే ఏడాది నాటికి ఈ బ్రిడ్జి ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సముద్రంపై రైలు ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది.

వచ్ఛే ఏడాదికల్లా రెడీ అవ్వబోయే మరో టూరిస్ట్ స్పాట్ అయోధ్య రామమందిరం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం 2023 చివరినాటికి రెడీ అవుతుంది. వీలైనంత త్వరగా రామాలయాన్ని తెరవడం కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి.

2023 లో జరగబోతున్న హాకీ ప్రపంచకప్ కోసం మనదేశంలో బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం రెడీ అవుతుంది. రూర్కెలాలో కడుతున్న ఈ స్టేడియం దేశంలో ఇదే అతిపెద్ద హాకీ స్టేడియం.

వచ్చే ఏడాదికి అయోధ్యలో మసీదు నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ చారిత్రాత్మక మసీదుని డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ మసీదుతో పాటు ఛారిటబుల్ హాస్పిటల్, ఆడిటోరియం, రెస్టారెంట్, రీసెర్చ్ సెంటర్ లాంటివి కూడా ఉంటాయి.

First Published:  30 Dec 2022 12:07 PM GMT
Next Story