Telugu Global
Telangana

ఇంధనం కొరత ఎఫెక్ట్.. గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ

ఇంధనం కొరత కారణంగా రవాణా స్తంభించి పోవడంతో జొమోటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వినూత్న పద్ధతిలో ఫుడ్ డెలివరీ చేశాడు.

ఇంధనం కొరత ఎఫెక్ట్.. గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ
X

హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఇంధనం కొరత వల్ల చాలా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. హైదరాబాద్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి.

కొన్నిచోట్ల మాత్రమే ఇంధనం లభిస్తుండగా.. మరికొన్నిచోట్ల స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టారు. ఇంధనం కొరత కారణంగా రవాణా స్తంభించి పోవడంతో జొమోటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వినూత్న పద్ధతిలో ఫుడ్ డెలివరీ చేశాడు. గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ వెళ్లి కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


చంచల్‌గూడ ప్రాంతంలో పనిచేసే ఓ జొమాటో డెలివరీ బాయ్‌కి ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బైక్‌పై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసేందుకు పెట్రోల్ లేకపోవడంతో అతడు వినూత్నంగా ఆలోచించాడు. గుర్రంపై వెళ్లి కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ బ్యాగ్ తగిలించుకుని గుర్రంపై స్వారీ చేసుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫుడ్ డెలివరీ బాయ్ ఐడియాను మెచ్చుకుంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

First Published:  3 Jan 2024 12:41 PM GMT
Next Story