Telugu Global
Telangana

వాళ్లిద్దరూ రానన్నారు.. మీరైనా..?

తన ఒక్కరి పోరాటం వల్ల కనీసం మీడియా అటెన్షన్ కూడా రావట్లేదని గ్రహించిన ఆమె.. బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ కోరారు. కానీ ఆ రెండు పార్టీలు షర్మిలను లైట్ తీసుకున్నాయి. దీంతో ఆమె కోదండరాం దగ్గరకు వెళ్లారు.

వాళ్లిద్దరూ రానన్నారు.. మీరైనా..?
X

తెలంగాణలో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడుతున్నానని, విపక్షాలన్నీ కలసి రావాలంటున్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆల్రడీ కాంగ్రెస్, బీజేపీతో మాటలు కలిపారు. రేవంత్, బండి సంజయ్ కి ఫోన్లు చేసి మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొహం చాటేశారు. కాంగ్రెస్ కి ఫోన్ చేశారు కాబట్టి మేం రాలేం అని చెప్పారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఎటూ తేలక ఇప్పుడు షర్మిల.. కోదండరాం దగ్గరకు వెళ్లారు. ఓట్లు, సీట్లు లేని ఈ కాంబినేషన్ బాగుందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో జనంలోకి వెళ్లిన షర్మిల సాధించిందేమీ లేదు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ పాదయాత్ర చేస్తున్న ఆమెను జనం పట్టించుకోవట్లేదు. దీంతో ఆందోళనలు, అరెస్ట్ లు.. అంటూ ఆమధ్య కొంత హడావిడి చేశారామె. ఇప్పుడు TSPSC వ్యవహారంలో కూడా దూకుడు పెంచారు. తన ఒక్కరి పోరాటం వల్ల కనీసం మీడియా అటెన్షన్ కూడా రావట్లేదని గ్రహించిన ఆమె.. బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ కోరారు. కానీ ఆ రెండు పార్టీలు షర్మిలను లైట్ తీసుకున్నాయి. దీంతో ఆమె కోదండరాం దగ్గరకు వెళ్లారు.

తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంని కలసిన షర్మిల T - SAVE ఫోరం లో భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన కొట్లాడటమే T - SAVE లక్ష్యం అని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తె నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. T - SAVE ఫోరం అధ్యక్షుడు గా ఉండాలని కోదండరాంను కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు షర్మిల. కోదండరాంతోపాటు, వామపక్ష పార్టీలను కూడా కలవబోతున్నారామె. వామపక్షాలు ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ కి మద్దతు తెలిపాయి, వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయబోతున్నాయి. ఈ దశలో లెఫ్ట్ పార్టీలనుంచి షర్మిలకు మద్దతు ఉంటుందనుకోవడం అసాధ్యం. అయితే బీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి తన శక్తి సరిపోదని గ్రహించిన షర్మిల, గ్రూపు రాజకీయాలంటూ కొత్త ఎత్తుగడ వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలసి రాకపోయే సరికి.. మిగతా పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల.

First Published:  4 April 2023 8:26 AM GMT
Next Story