Telugu Global
Telangana

హిట్‌ అండ్‌ రన్ టు గంజాయి.. అరె ఏంట్రా ఇది!

డాక్టర్ మౌనిక అనే యువతితో షణ్ముక్ అన్న సంపత్ వినయ్ 9ఏళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. మౌనికను పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి తాజాగా మొహం చాటేశాడు.

హిట్‌ అండ్‌ రన్ టు గంజాయి.. అరె ఏంట్రా ఇది!
X

ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్-5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడు. ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా షణ్ముఖ్‌ను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్స్‌ కేసులో అతడిని హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. అన్న కోసం వెళితే తమ్ముడు దొరకడమే ఇక్కడ అసలు ట్విస్ట్.

మ్యాటర్‌లోకి వెళితే… డాక్టర్ మౌనిక అనే యువతితో షణ్ముక్ అన్న సంపత్ వినయ్ 9ఏళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. మౌనికను పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి తాజాగా మొహం చాటేశాడు. అన్నిరకాలుగా వాడుకుని వారంలో మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులను తీసుకుని సంపత్‌ వినయ్ ఉండే ఫ్లాట్‌కు వెళ్లింది. అన్న సంపత్‌ కోసం వెళ్లిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అక్కడే గంజాయి కొడుతూ పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు షణ్ముక్ జస్వంత్. వీడియో తీస్తున్న మౌనికను షణ్ముక్ అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో అన్నదమ్ములిద్దరినీ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు నార్సింగి పోలీసులు.

ఇద్దరిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం. షణ్ముక్‌ పోలీసులకు పట్టుబడటం ఇది మొదటిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులోనూ ఓసారి అరెస్ట్ అయి రిలీజ్ అయ్యాడు. ఫుల్లుగా మద్యం సేవించి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. పట్టుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. బిగ్‌బాస్‌కు ముందు ప్రముఖ యూట్యూబర్‌ దీప్తి సునైనాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలాడు షణ్ముక్. కానీ బిగ్‌బాస్‌లో జరిగిన పరిణామాలతో వాళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు.

First Published:  22 Feb 2024 7:32 AM GMT
Next Story