Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికల్లో యూత్‌ కీ రోల్‌.. 30 శాతం వారే..!

తెలంగాణలో 3.14 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 7 లక్షల మంది 18-19 మధ్య వయస్సు ఉన్నవారే. 75 లక్షల మంది 19 నుంచి 35 ఏళ్ల మధ్య వ‌య‌స్సు వారున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో యూత్‌ కీ రోల్‌.. 30 శాతం వారే..!
X

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా యువత ప్రభావం ఎక్కువ‌. తాజా ఎలక్టోరల్ డేటా ప్రకారం.. తొలిసారి ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న యూత్ 7 లక్షల మంది ఉన్నారు. 35 ఏళ్లకు తక్కువగా ఉన్నవారితో కలుపుకుంటే జాబితాలో 30 శాతం మంది యువత ఉన్నారు. దీంతో అన్ని రాజ‌కీయ పార్టీలు, అభ్యర్థులు.. యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి.

మొత్తం తెలంగాణలో 3.14 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 7 లక్షల మంది 18-19 మధ్య వయస్సు ఉన్నవారే. 75 లక్షల మంది 19 నుంచి 35 ఏళ్ల మధ్య వ‌య‌స్సు వారున్నారు. ఓటు వేసేందుకు యూత్ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుందని, వారిని ఆకట్టుకోవాలంటే మేనిఫెస్టోలో హామీలు ప్రకటించడమే కాకుండా.. యువతకు ఎక్కువగా టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు.

యాదృచ్ఛికంగా 2018 ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు అర్హులైన యూవ‌త‌ సంఖ్య 7 లక్షలుగానే ఉంది. ఈ గ్రూపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశాలున్నాయి. దీంతో పార్టీలన్ని ఈ వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌ ఓ అడుగు ముందుకేసి ఇప్పటికే యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.

బీజేపీ, బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది. బీజేపీ ప్రధానంగా ప్రధాని మోడీ పనితీరును యువతకు వివరించనుంది. చంద్రయాన్‌-3 సక్సెస్‌, ఇటీవల జీ-20 సమ్మిట్ సమావేశాల గురించి యువతకు వివరించనున్నారు బీజేపీ నేతలు. దీంతో పాటు అగ్నివీర్‌, మేకిన్ ఇండియా పథకాలపై అవగాహన కల్పిస్తామని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇక బీఆర్ఎస్ యువతను కనెక్ట్ అయ్యేందుకు సీఎం కప్‌ పేరిట క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది.

First Published:  25 Sep 2023 4:44 AM GMT
Next Story