Telugu Global
Telangana

'చేనేత పై తెలంగాణ ప్రభుత్వ విధానాలను చూసి ప్రపంచం నేర్చుకోవాలి'

అమెరికా ప్రభుత్వ రీసెర్చ్ గ్రాంట్ కింద వివిధ ఆసియా దేశాల్లో చేనేత రంగం, నేత కార్మికుల నైపుణ్యాలను కైరా అధ్యయనం చేస్తోంది. తన అధ్యయన యాత్రలో భాగంగా సిద్దిపేటలో సెరికల్చర్ రైతులతో మాట్లాడిన అనంతరం సిరిసిల్ల, పోచంపల్లిలో ఆమె పర్యటించారు.

చేనేత పై తెలంగాణ ప్రభుత్వ విధానాలను చూసి ప్రపంచం నేర్చుకోవాలి
X

అమెరికాకు చెందిన హాండ్లూమ్, టెక్స్ టైల్ రీసర్చ్ స్కాలర్ కైరా జాప్ తెలంగాణను సందర్శించారు. ఇక్కడ చేనేత కళాకారుల పనితనానికి ముగ్దులయ్యారు. ప్రభుత్వం చేనేత అభివృద్ది కోసం చేపడుతున్న విధానాలను చూసి ప్రపంచం నేర్చుకోవాలన్నారు.

అమెరికా ప్రభుత్వ రీసెర్చ్ గ్రాంట్ కింద వివిధ ఆసియా దేశాల్లో చేనేత రంగం, నేత కార్మికుల నైపుణ్యాలను కైరా అధ్యయనం చేస్తోంది. తన అధ్యయన యాత్రలో భాగంగా సిద్దిపేటలో సెరికల్చర్ రైతులతో మాట్లాడిన అనంతరం సిరిసిల్ల, పోచంపల్లిలో ఆమె పర్యటించారు.

తమ దుస్తులు ఎక్కడి నుండి వస్తాయో పెద్దగా తెలియని USలో చదువుకున్న కైరా బట్టల చరిత్రను ముఖ్యంగా మధ్యయుగ డిజైన్‌లను పరిశోధించడం ఆస్చర్యకర విషయమే.

ప్లాస్టిక్ లు, పాలిస్టర్‌లకు దూరంగా సుస్థిరమైన చేనేత‌ వైపు వెళ్ళాలన్న‌ బలమైన వైఖరిని కలిగి ఉన్న కైరా, "నేను చేనేత పరిశ్రమను ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఇది పర్యావరణానికి హాని కలిగించదు. సహజ ఫైబర్‌లను ప్రోత్సహిస్తుంది." అని చెప్పిందామె.

తెలంగాణ నేత కార్మికుల అసమాన ప్రతిభతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ టౌన్ అభివృద్ధికి పూనుకోవడం పట్ల తాను విస్మయం చెందానని చెప్పారు కైరా. 30,000 కంటే ఎక్కువ పవర్ లూమ్‌లకు నిలయమైన, నేత కార్మికులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్న‌ సిరిసిల్ల ను చూసి ఆమె ఆశ్చర్యపోయారు.

"నేత కార్మికులకు సహాయం చేస్తున్న‌ ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతమైనవి. మిగిలిన ప్రపంచం తెలంగాణ నుండి నేర్చుకోవాలి. నేను ఈ పథకాలను ప్రపంచమంతా చూడాలనుకుంటున్నాను, "అని ఆమె వ్యాఖ్యానించారు.

"సుస్థిరత, నేత కార్మికుల‌ గురించి నిజంగా శ్రద్ధ వహించే మంత్రులుండటం అనేది సరైన దిశలో ఒక పెద్ద అడుగు. ఇక్కడి ప్రజలు చాలా గర్వపడాలి' అని కైరా అన్నారు.

సిరిసిల్ల పర్యటనలో చేనేత కార్మికులు హ్యాండ్ లూమ్ నుంచి పవర్ లూమ్‌లకు మారడంపై కూడా ఆమె ఆరా తీశారు, ఆధునీకరణ తనను ఆశ్చర్యపరిచిందన్నారు.

''ఇక్కడి నేత కార్మికులు అద్భుతమైన‌ ప్రతిభావంతులు. నేను వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడిని కలుసుకున్నాను. అతని నైపుణ్యం చూసి నేను చాలా ముగ్ధురాలిన‌య్యాను. అతను బట్ట నేయడమే కాదు కళను సృష్టిస్తున్నాడు. అతని రంగు సిద్ధాంతం చాలా ఆసక్తికరంగా ఉంది, "అని కైరా చెప్పారు. హరిప్రసాద్ తన సిరిసిల్ల సిరి పట్టు చీరలు,ముఖ్యంగా మడతపెట్టి అగ్గిపెట్టెలో ఉంచే చీర, ఇతర వినూత్న చేనేత ఉత్పత్తులతో ప్రజాదరణ పొందారు, .

కైరా అంతకు ముందు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. చేనేత పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నసహకారం, సంక్షేమ కార్యక్రమాలను కేటీఆర్ ఆమెకు వివరించారు.

తన భారత పర్యటన సందర్భంగా, కైరా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించనున్నారు.

First Published:  8 Dec 2022 2:46 AM GMT
Next Story