Telugu Global
Telangana

అన్ని ర్యాంకుల్లో తెలంగాణ ముందుంటే... విపక్షాలవి దిక్కుమాలిన విమర్శలు...కేటీఆర్

దేశంలో అనేక రంగాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకులు సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే విపక్షాలు మాత్రం తమ ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే దిక్కుమాలిన లాజిక్ మాట్లాడుతున్నాయ‌ని ఆయన విమర్శించారు.

అన్ని ర్యాంకుల్లో తెలంగాణ ముందుంటే... విపక్షాలవి దిక్కుమాలిన విమర్శలు...కేటీఆర్
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ విపక్షాల మీద విరుచుకపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం కోసం ఏమీ చేయడం లేదంటూ ఆరోపణలు చేస్తున్న విపక్షాలు, కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో తెలంగాణ‌కు ఇస్తున్నర్యాంకులను, అవార్డులను ఎందుకు పట్టించుకోవు అంటూ ప్రశ్నించారు.

బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో...

''స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది

స్వచ్ఛ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మున్సిపాలిటీలు 16 అవార్డులను గెలుచుకున్నాయి

భారత ప్రభుత్వం యొక్క అనేక ర్యాంకింగులు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో చూపిస్తున్నాయి

మరో వైపు మా ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని తెలంగాణలో ప్రతిపక్షాలు చెబుతున్నాయి!

ఇదేం దిక్కుమాలిన లాజిక్ ?'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

First Published:  26 Sep 2022 6:30 AM GMT
Next Story