Telugu Global
Telangana

ఆర్టీసీ సిబ్బందిపై దాడిచేస్తే ఎవరికైనా ఇదే గతి

ఇటీవల అంబర్‌పేటకు చెందిన సమీనా బేగం తెల్లవారుజామున హయత్‌ నగర్‌ డిపో-1కు చెందిన బస్సు ఎక్కింది. చిల్లర విషయంలో కండక్టర్‌తో గొడవపడింది.

ఆర్టీసీ సిబ్బందిపై దాడిచేస్తే ఎవరికైనా ఇదే గతి
X

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ డిపో-1కు చెందిన బస్సులో ఇటీవల ఇద్దరు కండక్టర్లపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. విచారణ త్వరగా చేపట్టి నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఎల్బీనగర్ పోలీసులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభినందించారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా ఏమాత్రం సహించేది లేదని మరోసారి స్పష్టంచేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్‌ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్‌ తెరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్షణికావేశంలో దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు సజ్జనార్.

మ్యాటర్‌లోకి వెళ్తే.. ఇటీవల అంబర్‌పేటకు చెందిన సమీనా బేగం తెల్లవారుజామున హయత్‌ నగర్‌ డిపో-1కు చెందిన బస్సు ఎక్కింది. చిల్లర విషయంలో కండక్టర్‌తో గొడవపడింది. ఇది మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ చెప్పినా వినకుండా బూతుల వర్షం కురిపించింది. అక్కడితో ఆగకుండా ఇద్దరు కండక్టర్లను కాలితో తన్నింది. చంపేస్తానంటూ కండ‌క్టర్‌ను బెదిరించింది. తోటి ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. వద్దమ్మా అని చెప్పిన మ‌రో మ‌హిళా కండ‌క్టర్‌ను సైతం బండ బూతులు తిట్టింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సమీనా బేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

First Published:  5 Feb 2024 3:16 AM GMT
Next Story